చాలా మిస్ అవుతున్నాం… కన్నీళ్లు పెట్టిస్తున్న అలేఖ్య రెడ్డి పోస్ట్!

నందమూరి తారకరత్న మరణ వార్త ఒక్కసారిగా చిత్ర పరిశ్రమతో పాటు నందమూరి కుటుంబంలోనూ నందమూరి అభిమానులలో తీవ్ర విషాదం నింపింది. ఇలా 39 సంవత్సరాల వయసులోనే తారకరత్న మరణించడంతో ఆయన సతీమణి అలేఖ్య రెడ్డి శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే ఈయన పుట్టినరోజుకు మూడు రోజుల ముందు మరణించడంతో ఈ విషయం మరింత కృంగదీస్తుంది. నందమూరి తారకరత్న 27వ తేదీ జనవరి నెలలో గుండెపోటుకు గురై ఉన్నఫలంగా స్పృహ తప్పి పడిపోయారు.

ఇలా 23 రోజులపాటు ఈయనని బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. అయితే ఈయన పరిస్థితి విషమంగా మారడంతో ఫిబ్రవరి 18వ తేదీ తారకరత్న కన్నుమూశారు.అయితే ఈయన పుట్టినరోజు ఫిబ్రవరి 22వ తేదీ ఇలా పుట్టినరోజుకు మూడు రోజుల ముందు చనిపోవడంతో కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తారకరత్న పుట్టినరోజు సందర్భంగా తన భార్య అలేఖ్యరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఎమోషనల్ పోస్ట్ అందరిని కన్నీళ్లు పెట్టేస్తోంది.

ఈ క్రమంలోనే అలేఖ్య రెడ్డి ఇంస్టాగ్రామ్ వేదికగా తారకరత్న తన పెద్ద కుమార్తె నిష్కతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ… నా జీవితంలో ఉత్తమ తండ్రి ఉత్తమ భర్త అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. హ్యాపీ బర్త్ డే…నిన్ను చాలా మిస్ అవుతున్నా అంటూ ఈమె ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇలా అలేఖ్య రెడ్డి తారకరత్న గురించి చేసినటువంటి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులను కన్నీళ్లు పెట్టిస్తోంది.

ఇక తారకరత్న చిన్న కర్మలో భాగంగా అలేఖ్య రెడ్డి తారకరత్న లేరని విషయాన్ని గుర్తు చేసుకొని ఏకధాటిగా కంటతడి పెట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు సైతం ఎమోషనల్ అవుతున్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus