ట్విట్టర్లో అల్లు అర్జున్ మరియు మెగా ఫ్యాన్స్ మధ్య పెద్ద వార్ జరుగుతుంది. దీంతో అల్లు అర్జున్ ను పరోక్షంగా నందమూరి అభిమానులు అడాప్ట్ చేసుకుని అతనికి మద్దతు పలుకుతున్నారు. దీని వెనుక కొంచెం పెద్ద కథే ఉంది.అదేంటో విశ్లేషిద్దాం రండి. విషయంలోకి వెళితే.. అల్లు అర్జున్ సొంత టాలెంట్ తో స్టార్ డం సంపాదించుకున్న హీరో.ఇది నిజం. ఈ విషయం అందరికీ తెలుసు. చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ ను మెగా అభిమానులు బాగా ఓన్ చేసుకున్నారు. అటు తర్వాత అల్లు అర్జున్ వైపు వాళ్ళు తిరుగుతున్నారు అనుకున్న టైంలో చాలా విషయాలు జరిగాయి.
అదే టైములో రాంచరణ్ చాలా డల్ ఫేస్ లో ఉండేవాడు. మెగా అభిమానులు అతన్ని ఎక్కువగా పట్టించుకునేవారు కాదు. చరణ్ నటనని వాళ్ళు ఇష్టపడే వారు కాదు. బన్నీ సినిమాలనే వాళ్ళు ఎంజాయ్ చేసేవారు. అయితే ‘చెప్పను బ్రదర్’ అనే ఇష్యూతో బన్నీ మెగా అభిమానులకు వ్యతిరేకం అయిపోయాడు. దీంతో అప్పటి నుండీ బన్నీ ప్లేస్ లో చరణ్ ను వాళ్ళు లేపడం మొదలుపెట్టారు. ‘ధృవ’ ‘రంగస్థలం’ వంటి చిత్రాలు హిట్ అవ్వడంతో బన్నీని పక్కకు నెట్టే ప్రయత్నం కూడా చేశారు.
నిజానికి అల్లు అర్జున్ కు కూడా మెగా హీరో అనిపించుకోవడం ఇష్టం లేదు. తన తాతగారి వల్ల, తండ్రి వల్ల చిరు పెద్ద హీరో అయ్యారు. ఇది ఎవ్వరూ ఒప్పుకోలేని చేదు నిజం. బన్నీలో ఇది ఉందో లేదో తెలీదు.కానీ తను ఇండివిడ్యువల్ గా ఉన్నత స్థాయికి చేరుకోవాలనుకుంటున్నాడు. అందుకే సొంతంగా అతను ఎదిగాడు.. తన పేరునే బ్రాండ్ గా తయారు చేసుకున్నాడు.’ఆర్.ఆర్.ఆర్’ తో చరణ్ పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు అంటున్నారు.అది నిలబడుతుందో లేదో తెలీదు.
కానీ అతనికంటే ముందే అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అది కూడా అంతంత మాత్రంగా ఉన్న ‘పుష్ప’ చిత్రంతో. ఈ సినిమా అక్కడ హిట్ అయ్యింది అంటే ప్రధాన కారణం బన్నీ యాక్టింగ్ అనే చెప్పాలి. దీంతో ‘పుష్ప 2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చరణ్ నెక్ట్ సినిమా బాలీవుడ్లో భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ను రాబడుతుందో లేదో తెలీదు కానీ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాకి మాత్రం కచ్చితంగా భారీ ఓపెనింగ్స్ నమోదవుతాయి.
మొన్నటికి మొన్న ఆల్ ఇండియా మెగా ఫ్యాన్స్ తో జరిగిన మీటింగ్లో అల్లు అర్జున్ ఫ్లేక్సీలు లేవు. అతని అభిమానులను కూడా ఆ మీటింగ్ కు హాజరు కానివ్వలేదు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మధ్య చిచ్చు రగులుకున్నట్టు అయ్యింది. దీంతో అల్లు అర్జున్ కు ఎన్టీఆర్ అభిమానులు అండగా నిలబడుతున్నారు. ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి ఎన్టీఆర్ ట్వీట్ వేసాడు. సినిమా అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసించాడు.
అలాగే బన్నీ- తారక్ ఒకరినొకరు బావ అని పిలుచుకుంటూ ఉంటారు. ఇక ‘ఆహా’ లో నందమూరి బాలకృష్ణ ‘అన్స్టాపబుల్’ అనే షో చేశాడు. అలాగే ‘అఖండ’ ప్రీ రిలీజ్ వేడుకకి బన్నీ, ‘పుష్ప’ ప్రమోషన్లను ‘అన్స్టాపబుల్’ షోలో జరిపారు. దీంతో నందమూరి అభిమానులు అల్లు అర్జున్ కు పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ‘నందమూరి అల్లు అర్జున్’ గా బన్నీ మారిపోయాడు అనడానికి ప్రధాన కారణం ఇదే.!
Most Recommended Video
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!