Mahesh Babu, Trivikram: ‘మహేష్ 28’.. మహేష్ ను ఢీ కొట్టే విలన్ గా ఆ మాజీ హీరో..!

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 3వ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘అతడు’ ‘ఖలేజా’ చిత్రాలు బ్లాక్ బస్టర్లు అయ్యింది లేదు. కానీ మహేష్ బాబు అభిమానులతో పాటు బుల్లితెర ప్రేక్షకులను ఆ సినిమాలు విపరీతంగా అలరించాయి. ఇప్పుడు వీరి కాంబినేషన్లో రూపొందనున్న 3వ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘భరత్ అనే నేను’ ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ ‘సర్కారు వారి పాట’ వంటి వరుస విజయాలతో దూకుడు మీదున్న మహేష్..

ఈ చిత్రంతో ఓ భారీ బ్లాక్ బస్టర్ అందుకోవాలని చూస్తున్నాడు. మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్.. ఈ చిత్రాన్ని తీర్చిదిద్దనున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీలో కొంచెం ‘నువ్వు నాకు నచ్చావ్’ పోలికలు ఉంటాయని కూడా ఇన్సైడ్ సిర్కిల్స్ సమాచారం.’హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇదిలా ఉండగా.. మహేష్ బాబు 28వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులో కథ ప్రకారం మరో హీరోకి కూడా అవకాశం ఉందట.

అది కొంచెం నెగిటివ్ షేడ్స్ తో కూడుకున్నది అని సమాచారం. ఈ పాత్ర కోసం కొంతమంది యంగ్ హీరోలను సంప్రదించారు మేకర్స్. నాని, నితిన్ వంటి హీరోల పేర్లు కూడా వినిపించాయి. అయితే ఫైనల్ గా మాజీ హీరో నందమూరి తారక రత్న ఈ పాత్రకి ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ విషయాన్ని దర్శకనిర్మాతలు అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రం టైటిల్ మరియు మహేష్ లుక్ పోస్టర్ ను సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మే 31న విడుదల చేయనున్నట్టు సమాచారం.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus