థమన్ చేతుల మీదుగా నందిత శ్వేతా నటించిన “IPC 376” మూవీ ట్రైలర్ విడుదల

పవర్ కింగ్ స్టూడియో బ్యానర్ పై ఎస్.ప్రభాకర్ సమర్పణలో హీరోయిన్ నందిత శ్వేతా ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం IPC 376. రాజ్ కుమార్ సుబ్రమన్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర ట్రైలర్ ను సంగీత దర్శకుడు థమన్ విడుదల చేశారు. ఒక బంగ్లాలో జరిగే అనూహ్య ఘటనలు పోలీసులకు సవాల్ విసురుతాయి. ఆధునిక యుగంలో సైన్స్ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుందంటూ చెబుతూనే, అటు అతీంద్రియ శక్తుల ఉనికిని విజువల్స్ లో చూపించారు. రేప్ చేస్తారు, ప్రాణాలతో తగలబెడతారు, అమ్మాయిలను బతకనివ్వరా అంటూ నందిత శ్వేతా చెప్పిన ఎమోషనల్ పవర్ ఫుల్ డైలాగ్ తో ఐపీసీ 376 ట్రైలర్ ఆసక్తికరంగా ముగిసింది.

ట్రైలర్ లోని వివిధ ఇంట్రెస్టింగ్ షాట్స్ చిత్ర కథ గత థ్రిల్లర్ సినిమాలకు భిన్నమైన నేపథ్యంతో ఉందని తెలుపుతున్నాయి.పోలీస్ అధికారి పాత్రలో నందిత శ్వేత ఫుల్ స్వింగ్ లో నటించిందని ట్రైలర్ చూపిస్తోంది. యాదవ్ రామలిక్కమ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు సి.కళాధర్ సాహిత్యం అందిస్తున్నారు. తెలుగు & తమిళ్ బైలింగ్వల్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది.


మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus