Nani: మహేష్ బాబు సినిమాలో నాని లేనట్లే!

‘సర్కారు వారి పాట’ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో మహేష్ బాబు ఫుల్ జోష్ లో ఉన్నారు. అలానే ఆయన నిర్మించిన ‘మేజర్’ కూడా సూపర్ హిట్ అయింది. ఈ రెండు సినిమాల సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు మహేష్ బాబు. ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కి వెళ్లిన మహేష్ బాబు తిరిగిరాగానే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఇందులో పూజాహెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది. ఇదిలా ఉండగా..

ఈ సినిమాకి సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొన్నామధ్య ఈ సినిమాలో మహేష్ బాబుకి విలన్ గా తారకరత్న కనిపిస్తారని వార్తలు రాగా.. అందులో నిజం లేదని కొట్టిపారేశారు తారకరత్న. ఈ వార్తలను ఫుల్ స్టాప్ పడిన తరువాత మరో వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో నాని కూడా కనిపిస్తాడని అంటున్నారు. స్క్రిప్ట్ ప్రకారం.. కథలో ఓ కీలకపాత్ర ఉందని, దానికోసం త్రివిక్రమ్ హీరో నానిని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి.

నాని వెంటనే ఓకే చెప్పేశారని కథనాలు పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించారు నాని. ఆయన నటించిన ‘అంటే సుందరానికి’ సినిమా రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు నాని. ఈ సందర్భంగా ఆయనకు మహేష్ సినిమాకి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.

దీనిపై స్పందించిన నాని.. తాను మహేష్ బాబు సినిమాలో యాక్ట్ చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు. అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేశారు. ప్రస్తుతం నాని ‘దసరా’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆయన డిఫరెంట్ లుక్ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus