Nani: నాని సినిమాకి ఈ ఎపిసోడ్ ప్లస్ కానుందా..?

‘శ్యామ్ సింగరాయ్’ లాంటి హిట్ తరువాత నాని నుంచి ‘అంటే సుందరానికి’ అనే సినిమా వచ్చింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలైంది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఓటీటీలో మాత్రం ఈ సినిమాకి మంచి వ్యూయర్ షిప్ దక్కింది. ప్రస్తుతం నాని చేతిలో ఒక్క సినిమా మాత్రమే ఉంది. అదే ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్స్ ను విడుదల చేశారు.

ఇందులో నాని మాస్ లుక్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సినిమాపై నాని చాలా ఆశలే పెట్టుకున్నారు. సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో ఇది పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ అని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమాలో మంచి లవ్ స్టోరీ కూడా ఉందట. రెగ్యులర్ గా సినిమాల్లో కనిపించే రాజు-పేద టైప్ లవ్ స్టోరీనే ‘దసరా’లో కూడా చూపించబోతున్నారు. కథ ప్రకారం.. సినిమాలో హీరోయిన్ సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి.

హీరో మాత్రం స్లమ్ లో పుట్టిపెరిగినవాడు. వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించిందనే అంశాలను దర్శకుడు చాలా ఇంట్రెస్టింగ్ గా రాసుకున్నాడట. ఏదో కావాలని ఇరికించినట్లుగా కాకుండా.. కథతో పాటు ట్రావెల్ అయ్యే ఈ లవ్ స్టోరీ సినిమాకి ప్లస్ పాయింట్ అవుతుందని నమ్ముతున్నారు దర్శకనిర్మాతలు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో సముద్రఖని, సాయికుమార్, జరీనా వాహబ్ లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తోన్న ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus