Nani: ఇప్పుడు అదే సీన్స్‌ చేస్తాడు… అప్పుడేమవుతుందో?

నానిని నేచురల్‌ స్టార్‌ అని ఎందుకంటారో… ఆయన ప్రతి సినిమాలో చూపిస్తూ ఉంటారు. నటనలో మన పక్కింటి కుర్రాడిని మరపిస్తుంటాడు నాని. అందుకే ‘మన నాని’ అని మనం గర్వంగా చెప్పుకుంటుంటాం. అలాంటి నానికి ఫ్యాన్‌ అయిపోయాడు బాలీవుడ్‌ స్టార్‌ షాహిద్‌ కపూర్‌. నాని నటించిన ‘జెర్సీ’ సినిమాను షాహిద్‌ రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ సినిమాతో, నానితో తన జర్నీ గురించి చెప్పాడు షాహిద్‌.

ఇప్పుడు నా వయస్సు 40 ఏళ్లు. జీవితంలో ఆలస్యంగా సక్సెస్‌ అందుకోవడం ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను కూడా చాలా ఆలస్యంగా సక్సెస్‌ అందుకున్నవాడినే. అందుకే ‘జెర్సీ’ నా మనసుకు బాగా దగ్గరైన చిత్రం అని చెప్పుకొచ్చాడు షాహిద్‌ కపూర్‌. అంతేకాదు నాని నటనను కూడా షాహిద్‌ తెగ పొగిడేశాడు. ‘జెర్సీ’లో నాని నటన అద్భుతం. కొన్ని సీన్స్‌లో నాని యాక్టింగ్‌ చూసినప్పుడు ఏడుపు ఆపుకోలేకపోయాను అని వివరించాడు షాహిద్‌.

తెలుగులో ‘జెర్సీ’ని తెరకెక్కించిన గౌతమ్‌ తిన్ననూరినే హిందీ రీమేక్‌కూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మధ్యే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో విడుదల తేదీల్లో మార్పులుంటాయేమో చూడాలి. అన్నట్లు ‘జెర్సీ’కి ఉత్తమ తెలుగు చిత్రంగా ఇటీవల జాతీయ పురస్కారం వచ్చిన విషయం తెలిసిందే. మరి అలాంటి అవార్డు మూవీలో షాహిద్‌ ఎలా నటించి మెప్పిస్తాడో చూడాలి.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus