Rajamouli: రాజమౌళి మహాభారతం.. ఈ స్టార్స్ ఫిక్స్ అయినట్లే!

ఇండియన్ సినిమా లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి (S. S. Rajamouli) ఎప్పటి నుంచో తన డ్రీమ్ ప్రాజెక్టు గా భావిస్తున్న మహాభారతం ప్రాజెక్ట్‌పై మళ్లీ ఒక్కసారిగా ఆశలు పెరిగాయి. బాహుబలి (Baahubali) తర్వాత ఎన్నోసార్లు తప్పకుండా మహాభారతం తెరకెక్కిస్తానని స్పష్టం చేసిన జక్కన్న, ఇప్పుడు మరోసారి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. ఈసారి మరింత ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. కథ, నిర్మాణం ఎలా ఉండబోతుందన్న దానికంటే, ఇందులో ఎవరు ఎవరు నటిస్తారన్నదానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఎక్కువగా ఉంది.

Rajamouli

మహాభారతం కోసం ఇప్పటికే ముగ్గురు స్టార్ హీరోలను రాజమౌళి మనసులో ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తోంది. చాలా కాలంగా ఎన్టీఆర్‌ను (Jr NTR) శ్రీకృష్ణుడి పాత్రకు తీసుకోవాలని జక్కన్న చెబుతూ వస్తున్నారు. ఎన్టీఆర్ శక్తివంతమైన డైలాగ్ డెలివరీ, అతని నటనా ప్రతిభ శ్రీకృష్ణుడి క్యారెక్టర్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోతుందని రాజమౌళి అభిప్రాయం. ఇది ఆయన వ్యక్తిగత కోరిక కూడా. అభిమానులు కూడా ఎన్టీఆర్‌ని శ్రీకృష్ణుడిగా చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కర్ణుడి పాత్ర కోసం ప్రభాస్‌నే (Prabhas) ఎంచుకున్నట్టు తెలుస్తోంది. కర్ణుడి గంభీరత, బాధ, కరుణను ఫీల్ చేయించగల నటుడిగా ప్రభాస్‌ను రాజమౌళి భావిస్తున్నారు. ప్రభాస్‌కు ఉన్న మాస్ ఇమేజ్‌తో పాటు ఎమోషనల్ డెప్త్ కూడా కావాలని ఈ నిర్ణయానికి వచ్చారని టాక్. కర్ణుడి పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. ప్రభాస్ శక్తివంతమైన ప్రెజెన్స్ ద్వారా కర్ణుడి పాత్రను మరపురాని మలుపుగా మార్చాలని భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఇటీవల నాని కూడా మహాభారతంలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు రాజమౌళి సంకేతాలు ఇచ్చారు. హిట్ 3 (HIT 3)  ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని పేరును ప్రస్తావించడం దీనికి నిదర్శనం. నానిలో ఉన్న నేచురల్ యాక్టింగ్ స్కిల్స్, క్యారెక్టర్ డెప్త్‌ను దృష్టిలో పెట్టుకొని ఓ ప్రత్యేక పాత్రను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే నాని (Nani) ఏ పాత్రలో కనిపించబోతున్నాడో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.

ప్రస్తుతం మహేష్ బాబుతో (Mahesh Babu) ఓ గ్లోబల్ అడ్వెంచర్ డ్రామా చేస్తున్న రాజమౌళి, ఆ సినిమా పూర్తయిన తర్వాతే మహాభారతం పనులను ప్రారంభింస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ నెమ్మదిగా, పెద్ద స్కేల్‌లో ముందుకెళ్లబోతోందట. నాలుగు లేదా ఐదు భాగాలుగా తెరకెక్కించబోయే ఈ ప్రాజెక్ట్‌కు కాస్టింగ్ విషయంలో రాజమౌళి చాలా జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంది.

హిట్ 3: ఆ కాంబినేషన్ పై ముందే లీక్ ఇచ్చేశారే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus