Nani, Balakrishna: ‘అన్స్టాపబుల్’ సెకండ్ ప్రోమో అదిరిపోయిందిగా..!

బాలయ్య ‘ఆహా’ వారి కోసం చేస్తున్న టాక్ షో ‘అన్స్టాపబుల్’. బాలయ్య ఏంటి టాక్ షో చేయడమేంటి? అని సందేహ పడిన వారికి, అలాగే విమర్శించిన వారికి ఫస్ట్ ఎపిసోడ్ అవుట్పుట్ తో సమాధానం దొరికే ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఇక అదే ఉత్సాహంతో రెండో ఎపిసోడ్ కు కూడా రంగం సిద్ధమైంది. ఈ రెండో ఎపిసోడ్ కు నేచురల్ స్టార్ నాని గెస్ట్ గా వచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు ‘ఆహా’ టీం.

ఈ ప్రోమోలో బాలయ్య, నాని ల అప్పీరెన్స్ అదిరిపోయింది అనే చెప్పాలి. అసలే నాని… బాలయ్య ఫ్యానేమో, దాంతో అతను ఆనందంతో మురిసిపోతున్నాడని స్పష్టమవుతుంది. బాలయ్య సినిమాల్లోకి డైలాగులు నాని చెప్పడం, అలాగే నాని సినిమాల్లోని డైలాగులు బాలయ్య చెప్పడం.. అంతేకాకుండా రిలాక్స అవ్వడానికి నాన్న గారి సినిమాలు, మేన్షన్ హౌస్ అంటూ బాలయ్య చెప్పడం నవ్వులు పూయించే అంశాలు. అలాగే ఇటీవల కొందరు డిస్ట్రిబ్యూటర్లు నానిని విమర్శిస్తూ పెట్టిన మీటింగ్ ల గురించి అలాగే నాని సినిమాలు ఓటిటిల్లో విడుదలైన సందర్భాల గురించి కూడా డిస్కషన్లు వచ్చాయి.

ప్రోమోలో ఓ చోట నానిని.. ‘పులిహోర కబుర్లు చెప్పొద్దు’ అంటూ బాలయ్య అనడం కూడా ఈ ఎపిసోడ్ చూడాలనే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నాయి. ప్రోమో అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!


రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus