నాని తరవాతే ఎన్టీఆర్, బన్నీ!

అష్టాచమ్మా సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నాని మంచి కథలను ఎంచుకొని నేచురల్ స్టార్ గా ఎదిగారు. భలే భలే మగాడివోయ్, జెంటిల్‌మేన్, నేను లోకల్, ఎంసీఏ వంటి చిత్రాలతో వరుసగా హిట్స్ కొట్టి అభిమానులను పెంచుకున్నారు. తెలుగు యువతలో అతనికి ఉన్న క్రేజ్ చూసి ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ గా వ్యవహరించే ఛాన్స్ ఇచ్చారు. ప్రస్తుతం అక్కినేని నాగార్జునతో కలసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటిస్తూ.. బిగ్ బాస్ షో కి హోస్ట్ గా చేస్తున్నారు. తాజాగా ఇతను అరుదైన మార్క్ ని క్రాస్ చేశారు. ట్విట్టర్లో ఎన్టీఆర్ ని, ఆలు అర్జున్ ని వెనక్కి నెట్టి ఔరా అనిపించారు.

తాజాగా నాని ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య మూడు మిలియన్లకు చేరింది. ఈ విషయాన్ని నాని స్వయంగా ట్వీట్ చేశారు. “ఇప్పుడు నా ఫ్యామిలీ మూడు మిలియన్ల స్ట్రాంగ్” అంటూ నాని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఫాలోవర్స్ ని కుటుంబ సభ్యులంటూ  చెబుతూ మరింతమంది అభిమానాన్నీ చూరగొన్నారు.  ఎన్టీఆర్‌కు 2.34 మిలియన్ ఫాలోవర్లు ఉండగా.. బన్నీ ఫాలోవర్ల సంఖ్య 2.53 మిలియన్లు. మూడు మిలియన్ల ఫాలోవర్స్ తో వీరిని నాని క్రాస్ చేశారు. నాని కంటే ముందు తెలుగు హీరోల్లో మహేష్ బాబు, నాగార్జున ఉన్నారు. మహేష్ బాబుకు అత్యధికంగా 6.61 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు కూడా 5.46 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఇలా ట్విట్టర్లోనే కాకుండా బిగ్ బాస్ హోస్టింగ్ లోను ఎన్టీఆర్ రికార్డును నాని బద్దలు కొడతాడేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus