Nani: నాచురల్ స్టార్ సినిమాలలో ఆ సినిమా అంటే చిరంజీవికి ఇష్టమా?

నాచురల్ స్టార్ నాని (Nani)  కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటుండగా సినిమాల ఎంపికలో వైవిధ్యం చూపించడం నాని సక్సెస్ సీక్రెట్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) సినిమాకు ఈ వారం కూడా బుకింగ్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి. దర్శకుడు వివేక్ ఆత్రేయ (Vivek Athreya)  మాస్ సినిమాలను సైతం అద్భుతంగా డీల్ చేయగలడని ఈ సినిమాతో మరోసారి ప్రూవైంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఖాతాలో సరిపోదా శనివారం సినిమాతో మరో సక్సెస్ చేరడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

Nani

తాజాగా సరిపోదా శనివారం సక్సెస్ మీట్ జరగగా ఈ సక్సెస్ మీట్ లో నాని (Nani) మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన సినిమాలలో చిరంజీవికి (Chiranjeevi)  శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy) సినిమా అంటే ఇష్టమని నాని చెప్పుకొచ్చారు. నా సినిమాలు విడుదలైన సమయంలో చిరంజీవి గారి నుంచి మెసేజ్ వస్తుందని నాని తెలిపారు.

దసరా (Dasara), హాయ్ నాన్న (Hi Nanna) సినిమాలు విడుదలైన సమయంలో చిరంజీవి గారి నుంచి మెసేజ్ వచ్చిందని శ్యామ్ సింగరాయ్ సినిమాను చిరంజీవి, సురేఖ కలిసి హోమ్ థియేటర్ లో చూశారని సినిమా చూసే సమయంలో స్టాఫ్ ఎవరో స్నాక్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే డిస్టర్బ్ చేయొద్దని చిరంజీవి చెప్పారని ఆ సినిమా గురించి చిరంజీవి గారు నాతో మాట్లాడటం ఎంతో సంతోషాన్ని కలిగించిందని నాని అన్నారు.

నాని (Nani) అభిమానులలో చాలామంది అభిమానులకు సైతం శ్యామ్ సింగరాయ్ ఫేవరెట్ మూవీ కాగా బుల్లితెరపై ఈ సినిమా రేటింగ్స్ పరంగా అదరగొట్టింది. రాహుల్ సాంకృత్యాన్ (Rahul Sankrityan) ఈ సినిమాకు దర్శకుడు కాగా ఈ సినిమాలో స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుందనే సంగతి తెలిసిందే. నాని రేంజ్ అంతకంతకూ పెరగాలని అభిమానులు కోరుకుంటున్నారు. రెమ్యునరేషన్ విషయంలో నాని టైర్2 హీరోలలో టాప్ లో ఉన్నారు.

అలా జరిగి ఉంటే ‘లుంగి డ్యాన్స్‌’ మిస్‌ అయ్యేవాళ్లం తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus