Hero Nani: టికెట్ రేట్లపై నాని షాకింగ్ కామెంట్స్ వైరల్!

  • June 7, 2022 / 12:33 PM IST

టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన నాని నటించిన అంటే సుందరానికి సినిమా మరో మూడు రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఎఫ్3, విక్రమ్, మేజర్ ఇలా వరుసగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తుండగా అంటే సుందరానికి సినిమా కూడా ఈ జాబితాలో చేరుతుందని నాని ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అంటే సుందరానికి ప్రమోషన్స్ లో భాగంగా నాని టికెట్ రేట్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. శ్యామ్ సింగరాయ్ సినిమా రిలీజ్ సమయంలో నాని టికెట్ రేట్లపై చేసిన కామెంట్లు ఏపీ సర్కార్ కు ఆగ్రహం తెప్పించాయి.

టికెట్ రేట్లు తగ్గించడమంటే ప్రేక్షకులను అవమానించడమే అని నాని షాకింగ్ కామెంట్లు చేసి అప్పట్లో వార్తల్లో నిలిచారు. అయితే ప్రస్తుతం టికెట్ రేట్లను పెంచడం వల్ల పెద్ద సినిమాలకు సైతం కలెక్షన్లు తగ్గుతున్నాయి. పెద్ద సినిమాలు సైతం రిలీజైన మూడు వారాలకే ఓటీటీలో అందుబాటులోకి వస్తున్నాయి. అంటే సుందరానికి సినిమాకు టికెట్ రేట్ల పెంపు ఉండదని నాని క్లారిటీ ఇచ్చారు. శ్యామ్ సింగరాయ్ సమయంలో చేసిన కామెంట్ల గురించి నాని స్పందిస్తూ తనపై నెగిటివ్ కామెంట్లు చేసే వాళ్లంతా తెలివితక్కువ వాళ్లని అన్నారు.

తాను టికెట్ ధరను 500 రూపాయలకు పెంచాలని అడగలేదని 20, 40, 60 టికెట్ రేట్లతో ఇండస్ట్రీ మనుగడ సాధించలేదని మాత్రమే చెప్పానని నాని తెలిపారు. అప్పుడు అది తప్పైతే ఇది కూడా తప్పేనని నాని కామెంట్లు చేశారు. అంటే సుందరానికి సినిమా ఓటీటీలో ఆలస్యంగా స్ట్రీమింగ్ అవుతుందని నాని చెప్పుకొచ్చారు. ఇప్పటికే విడుదలైన అంటే సుందరానికి మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా అంటే సుందరానికి నిలుస్తుందో లేదో చూడాలి.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus