Deepthi Ganta: నాని వల్లే డైరెక్టర్ అయ్యాను: నాని సోదరి

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం గురించి తరచూ ఏదో ఒక వార్త వినపడుతూనే ఉంటుంది. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన వారు నెపో కిడ్స్ గురించి దారుణమైన కామెంట్స్ చేస్తుంటారు.ఈ క్రమంలోనే పలువురు ఈ నెపోటిజం పై స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేస్తుంటారు. అయితే తాజాగా నెపోటిజం గురించి నాని సోదరీ దీప్తి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. నాని ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగుపెట్టి అనంతరం హీరోగా నిర్మాతగా కొనసాగుతున్నారు.

ఇలా హీరోగా సక్సెస్ అయినటువంటి నానీ సోదరీ దీప్తి మీట్ క్యూట్ అనే వెబ్ సిరీస్ ద్వారా డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ వెబ్ సిరీస్ కు నాని నిర్మాతగా వ్యవహరించారు. ఈ వెబ్ సిరీస్ సోనీ లీవ్ ద్వారా విడుదలయి ఎంతో మంచి స్పందన దక్కించుకుంది. ఈ క్రమంలోనే కొందరు నాని హీరో కనుక ఆయన సోదరి దీప్తి చాలా సులభంగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందని,

నాని లేకపోతే ఈమె డైరెక్టర్ అయ్యేది కాదు అంటూ తనని కూడా నెపోటిజం అంటున్నారని ఈ సందర్భంగా ఈమె ఎమోషనల్ అయ్యారు. చిన్నప్పటినుంచి మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పెరిగాం. మాకు ఎన్నో కోరికలు కలలు ఉన్నాయి. నాకు రచయితగా మంచి పేరు ఉంది. మీట్ క్యూట్ వెబ్ స్టోరీ కథ కూడా తానే సిద్ధం చేశానని చెప్పారు. ఇది విన్నటువంటి నాని తనని ప్రోత్సహించి ఈ వెబ్ సిరీస్ తానే నిర్మించాడని,

నిజానికి ఈ వెబ్ సిరీస్ హిట్ అయినప్పుడు నాకన్నా ఎక్కువగా నాని సంతోషపడ్డారని ఈమె తెలిపారు. అవును నేను నాని వల్లే డైరెక్టర్ అయ్యాను. నాని వల్లే ఈ వెబ్ సిరీస్ బయటకు వచ్చింది.ఎందుకు నేను నాని ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నామని ఈ సందర్భంగా దీప్తి ఎమోషనల్ పోస్ట్ చేశారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus