Hero Nani: ‘దసరా’ బడ్జెట్ తగ్గించనున్నారా..?

యంగ్ హీరో నాని చాలా కాలం తరువాత ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో హిట్ అందుకున్నారు. దీంతో తన సినిమాల జోరు పెంచారు. ఈ క్రమంలో ‘అంటే సుందరానికీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. మొదట పాజిటివ్ టాక్ వచ్చినా.. సరైన కలెక్షన్స్ ను మాత్రం రాబట్టలేకపోయింది. అయినప్పటికీ సినిమా హిట్ అని చెప్పుకుంటున్నారు నాని.

‘ఆవకాయ్’ మాదిరి తన సినిమా రోజురోజుకి బెటర్ అవుతుందని అన్నారు. కానీ అలా ఏం జరగడం లేదు. దీంతో నాని ఆలోచనలో పడ్డారు. తన తదుపరి సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ‘దసరా’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన మేజర్ పోర్షన్స్ ను పూర్తి చేశారు నాని. అయితే ‘అంటే సుందరానికీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ‘దసరా’ సినిమాకి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

నిజానికి ‘దసరా’ సినిమా నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా. ఇప్పుడు తన సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో ‘దసరా’ బడ్జెట్ తగ్గించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం నాని వెకేషన్ కి వెళ్లాలనుకుంటున్నారు. తన సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి హాలిడే ఎంజాయ్ చేయనున్నారు. తిరిగొచ్చిన తరువాత సినిమా షూటింగ్ మొదలుపెట్టనున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus