ఇటీవల ఒటిటిలో విడుదలైన ‘వి’ చిత్రానికి ఫ్లాప్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం రిలీజ్ కు ముందు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ప్రేక్షకులు.. సినిమా చూసిన తరువాత చాలా డిజప్పాయింట్ అయ్యారు. మిస్టరీ థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్ అని టీం బిల్డప్ ఇచ్చిన రేంజ్లో ఈ చిత్రం లేదని ప్రేక్షకులు చెప్పుకొచ్చారు.దిల్ రాజు ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వారికి … 33 కోట్లకు అమ్మేసుకుని మంచి పనిచేశారు అనే కామెంట్స్ కూడా వినిపించాయి.
నిజానికి ఈ చిత్రాన్ని 35.4 కోట్లకు అమెజాన్ వారికి అమ్మాడనేది తాజా సమాచారం. కేవలం డిజిటల్ రైట్స్ మాత్రమే కాదు… శాటిరైట్స్ బిజినెస్ విషయంలో కూడా ‘వి’ కి మంచి లాభాలే దక్కాయట. వివరాల్లోకి వెళితే… ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ను 8కోట్లకు ప్రముఖ జెమినీ టీవీ ఛానల్ సొంతం చేసుకుందట. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్ట్ చేసిన ‘వి’ చిత్రానికి దిల్ రాజు పెట్టిన బడ్జెట్ 40 కోట్లని(ఇంట్రెస్ట్ లు కూడా కలుపుకుని) తెలుస్తుంది.
ఇక డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ రూపంలో 43 కోట్ల వరకూ వచ్చాయి. ఇంకా డబ్బింగ్ రైట్స్ బిజినెస్ వివరాలు కూడా తెలియాల్సి ఉంది. అదొక 5 కోట్లకు జరిగినా దిల్ రాజు కి మరింత లాభాలు వచ్చినట్టే..! ఏమైనా… రాజు గారిది మామూలు తెలివి కాదనే చెప్పాలి…!
Most Recommended Video
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్ 4 హైలెట్స్: బిగ్‌బాస్ ఇలా రోజూ అయితే కష్టమే!
బిగ్‌బాస్ 4: ఇంట్లో వాళ్లు ఒకరు… బయటి నుంచి ముగ్గురట!