‘గ్యాంగ్ లీడర్’ కు కొత్త రిలీజ్ డేట్?

ఈ ఏడాది ‘జెర్సీ’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు నేచురల్ స్టార్ నాని. ఈ చిత్రం తర్వాత విక్రమ్ కుమార్ డైరెక్షన్లో ‘గ్యాంగ్ లీడర్’ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో నాని ‘క్రైమ్ స్టోరీ రైటర్’ గా కనిపించబోతున్నాడు. ‘ఆర్.ఎక్స్.100’ హీరో కార్తికేయ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తుండడం విశేషం. ఇటీవల విడుదల చేసిన టీజర్ కు కూడా అద్భుతమైన స్పందన లభించింది. దీంతో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. నిజానికి మొదట ఆగస్ట్ 30నే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ‘సాహో’ చిత్రం రిలీజ్ డేట్ మారి అదే డేట్ ను ఫిక్స్ చేసుకోవడంతో ‘గ్యాంగ్ లీడర్’ వాయిదా వేయక తప్పలేదు. అయితే కొత్త డేట్ ను త్వరలో ఎనౌన్స్ చేస్తారని అనుకున్నారు.

తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ 13న ‘గ్యాంగ్ లీడర్’ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలైన ‘మైత్రి మూవీ మేకర్స్’ డిసైడ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అయితే అదే రోజు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హరీష్ శంకర్ల ‘వాల్మీకి’ చిత్రం కూడా విడుదలవుతుంది. రెండు చిత్రాల పైనా మంచి అంచనాలే ఉన్నాయి. కానీ వారం రోజులు గ్యాప్ తీసుకుంటేనే బెటర్ అని డిస్ట్రిబ్యూటర్లు సూచిస్తున్నారట. కానీ రెండు చిత్రాలకి మంచి టాక్ వస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని… తమ చిత్రాల పై నమ్మకం ఉందని నిర్మాతలు ఎంతో నమ్మకంతో ఉన్నారట. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus