నాని రిజెక్ట్ చేసిన కథ.. ఈ హీరోకి కలిసొస్తుందా..?

ఒకప్పుడు దర్శకులు హీరోలను దృష్టిలో పెట్టుకొని కథలు రాసేవారు. అలా రాసుకున్న కథ హీరోకి నచ్చితే సెట్స్ పైకి వెళ్లేది లేదంటే పక్కన పెట్టేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఒక హీరో రిజెక్ట్ చేసిన కథను పక్కన పెట్టకుండా.. మరో హీరోకి వినిపిస్తున్నారు. ప్రాజెక్ట్ సెట్ అయితే పట్టాలెక్కిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ లో ఇదే సీన్ రిపీట్ అయింది. నేచురల్ స్టార్ నాని రిజెక్ట్ చేసిన కథను హీరో వైష్ణవ్ తేజ్ అంగీకరించాడట.

వివరాల్లోకి వెళితే.. ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథ నిర్మాత భోగవల్లి ప్రసాద్ కి బాగా నచ్చింది. ఫుల్ యాక్షన్ ఓరియెంటెడ్ కథ. మొదట ఇందులో హీరోగా నానిని తీసుకోవాలని అనుకున్నారు. కారణాలేంటో తెలియదు కానీ నాని మాత్రం ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట. దీంతో అదే కథను హీరో వైష్ణవ్ తేజ్ కి వినిపించగా.. అతడు నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఇటీవల వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా ఇచ్చిన ఉత్సహంతో వరుస సినిమాలు లైన్లో పెడుతున్నాడు ఈ మెగాహీరో. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో ‘జంగిల్ బుక్’ అనే సినిమాను పూర్తి చేశాడు. ఆ తరువాత మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఓ సినిమా.. దాని తరువాత భోగవల్లి ప్రసాద్ బ్యానర్ లో సినిమాను పూర్తి చేయనున్నాడు. మరి నాని రిజెక్ట్ చేసిన ఈ కథ వైష్ణవ్ కి హిట్ ను తీసుకొస్తుందేమో చూడాలి!

Most Recommended Video

చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!\

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus