త్వరలో సెట్స్ పైకి వెళుతున్న నాని ‘టక్ జగదీశ్’

తీసింది రెండు చిత్రాలే అయినా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు యువ దర్శకుడు శివ నిర్వాణ. నాని హీరోగా ఆయన తీసిన మొదటి చిత్రం ‘నిన్ను కోరి’ ఓ వైవిధ్యమైన ప్రేమ కథగా మిగిలింది. ఇక గత ఏడాది నాగ చైతన్య , సమంత జంటగా విడుదలైన ‘మజిలీ’ చిత్రం ఆయనకు మరింత పేరు తెచ్చింది. ఈ రెండు చిత్రాలతో శివ నిర్వాణ ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన మూడవ చిత్రం నాని తో చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం టక్ జగదీశ్ పేరుతో దీని టైటిల్ కూడా ప్రకటించారు. కాగా నేడు ఈ మూవీని అధికారికంగా ప్రారంభించారు.

హైదరాబాద్ వేదికగా టక్ జగదీశ్ మూవీ పూజా కార్యక్రమాలతో నేడు ప్రారంభమైంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వచ్చే నెల 11 నుండి టక్ జగదీష్ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. టక్ జగదీశ్ అన్నదమ్ముల మధ్య నడిచే ఎమోషన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమాను శివ నిర్వాణతో ‘మజిలీ’ చిత్రాన్ని నిర్మించిన సాహు గారపాటి, హరీష్ పెద్దిలు నిర్మిస్తున్నారు. రీతు వర్మ, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక నాని లేటెస్ట్ మూవీ ‘వి’ ఈ ఏడాది ఉగాది కానుగా మార్చ్ 25న విడుదల కానుంది. దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నాని నెగెటివ్ షేడ్స్ ఉన్న కిల్లర్ గా కనిపించనున్నాడు.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus