నితిన్ మాస్ట్రో మూవీ ఓటిటి రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం గట్టిగానే జరుగుతుంది. దాదాపు ఇది ఖరారు అయిపోయినట్టే అనే టాక్.. ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. మాస్ట్రో… బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన అందాదున్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ చిత్రాన్ని 3 ఏళ్ల క్రితమే ప్రేక్షకులు ఓటిటి లో చూసేసారు. ఈ పాండమిక్ టైంలో జనాలు థియేటర్లకు వస్తారు అన్న గ్యారెంటీ లేదు. సినిమాకి ఫ్లాప్ టాక్ వస్తే సినిమాకి కలెక్షన్లు రావు సరి కదా..
డిజిటల్ బిజినెస్ కూడా తక్కువ రేట్లకు జరుగుతుంది. మరోపక్క థర్డ్ వేవ్ టెన్షన్ అలాగే డెల్టా వేరియంట్ టెన్షన్ ఎలాగూ జనాల్లో ఉంది. అందుకే లాక్ డౌన్ ఎత్తేసినప్పటికి .. థియేటర్లు తెరుచుకున్నప్పటికీ దర్శక నిర్మాతలు ఈ విషయాలను ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. నితిన్ మాస్ట్రో కి రూ.29 కోట్ల బడ్జెట్ అయ్యింది. డిజిటల్ బిజినెస్ రూ.32 కోట్లకు జరిగింది. ఇంకా డబ్బింగ్ అండ్ శాటిలైట్ బిజినెస్ జరగాల్సి ఉంది. కాబట్టి టేబుల్ ప్రాఫిట్స్ దక్కుతాయి.
ఇప్పుడు వెంకటేష్, సురేష్ బాబు లు కూడా నితిన్ లానే ఆలోచిస్తున్నట్టు సమచారం. నారప్ప చిత్రం కోసం ఓటిటి సంస్థలను సంప్రదిస్తున్నారు. ఇది కూడా ఆసురన్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే.ఫ్లోపుల్లో ఉన్న శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించాడు కాబట్టి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆశించిన స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ జరగడం లేదట. అందుకే నిర్మాతలు ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
Most Recommended Video
తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!