ఏషియన్ గ్రూప్ అండ్ గ్లోబల్ ఫిలిమ్స్ అధినేత శ్రీ నారాయణ దాస్ నారంగ్ గారు ఈరోజు మరణించారు. కొన్నాళ్లుగా తీవ్ర అస్వస్థత తో బాధపడుతూ వస్తున్న ఈయన పరిస్థితి విషమించడంతో స్టార్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. అయితే చికిత్స పొందుతూనే ఆయన మరణించినట్టు తెలుస్తుంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా కూడా ఈయన పనిచేసారు.
‘శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి’ బ్యానర్ ను స్థాపించి ‘లవ్ స్టోరీ’ ‘లక్ష్య’ వంటి చిత్రాలను నిర్మించారు. అలాగే నాగార్జున- ప్రవీణ్ సత్తార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఘోస్ట్’, ‘ధనుష్- శేఖర్ కమ్ముల కాంబినేషన్లో తెరకెక్కుతున్న బైలింగ్యువల్ మూవీకి.. కూడా ఈయనే నిర్మాత. అంతే కాకుండా పలు తమిళ సినిమాలను కూడా ఈయన బ్యానర్ ద్వారా డబ్ చేశారు.
రజినీకాంత్ నటించిన ‘పెద్దన్న’, సూర్య నటించిన ‘ఈటి'(ఎవ్వరికీ తలవంచడు) వంటి చిత్రాలను కూడా ఈయనే తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు. అంతేకాకుండా పలు చిత్రాలకి ఫైనాన్సియర్ గా వ్యవహరించారు. ఈయన మరణం టాలీవుడ్ కు తీరని లోటు అంటూ సినీ పెద్దలు చెబుతూ తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.