ఎలక్షన్స్ టైమ్ లో పోలిటికల్ బయోపిక్స్ విడుదలవ్వకూడదు అనే ఏకైక కారణం చేత నిలిపివేయబడిన మన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ బయోపిక్ “పి.ఎం నరేంద్ర మోడి” ఎట్టకేలకు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం బీజేపీ శ్రేణులకు ఉత్సాహం కలిగించేలా ఉందని, కాంగ్రెస్ కి యాంటీగా ఉందని పలు వాదనలు అప్పట్లో వినిపించాయి. ఇప్పుడు అన్నీ చోట్లా ఎలక్షన్స్ పూర్తవ్వడం, మే 23తో రిజల్ట్స్ కూడా వచ్చేయనుండడంతో.. మే 24న సినిమాను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు దర్శకనిర్మాతలు.
అయితే.. ఇప్పుడు ఈ చిత్రాన్ని విడుదల చేయడం వల్ల ఉపయోగం ఏమిటి అని అందరూ అడుగుతున్నారు. ట్రైలర్ రిలీజ్ అప్పుడే సినిమా మీద విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అలాంటిది ఇప్పుడు సినిమా రిలీజ్ చేసి అనవసరంగా ఉన్న పరువు పోగొట్టుకోవడం తప్ప పెద్దగా ఉపయోగం ఏమీ లేదు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి సినిమా విడుదలయ్యాక ఎన్ని ట్రోల్స్ వస్తాయో చూడాలి.