నటుడిగా 52 ఏళ్ల ప్రయాణం నరేశ్‌ది. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి హీరోగా మారి, కమెడియన్‌గా చేసి, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించారు. అలాంటి ఆయనకు ఇంకా ఇలాంటి పాత్రలు చేయాలి అనే కలలు ఉంటాయా? అంటే కచ్చితంగా ఉన్నాయి అనే ఆయన చెబుతున్నారు. ఇటీవల ఆయన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారాయన. ఈ క్రమంలోనే తన కలల ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడారు.
ప్రపంచంలో 46 సినిమాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళ తన తల్లి విజయనిర్మల అని, ఆమె లాగే చాలామంది గొప్పవాళ్లకి పద్మ పురస్కారాలు రాలేదని గుర్తు చేశారు నరేశ్ (Naresh). ఆ పురస్కారాల కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు నరేశ్. ఇక సమాజానికి తిరిగి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఘట్టమనేని ఇందిరాదేవి పేరుతో సినిమా మ్యూజియం లైబ్రరీని ఏర్పాటు చేశామని చెప్పారు. దీని కోసం ఓ భవనాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు.
జంధ్యాల (Jandhyala) పేరుతో డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ థియేటర్ ప్రారంభించామని చెప్పారు. రచయిత సాయినాథ్ సహకారంతో జంధ్యాల గురించి ఓ పుస్తకాన్ని తీసుకొస్తున్నట్టు తెలిపారు నరేశ్. గత కొన్ని రోజుల్లోనే 22 కథలు విన్నానని, వాటిలో నచ్చినవి ఎంపిక చేసుకుని నటిస్తున్నాని చెప్పిన నరేశ్ రెండు సినిమాల్లో మెయిన్ రోల్స్ కూడా ఉన్నాయని చెప్పారు. ఓటీటీల్లోనూ కొన్ని మంచి ప్రాజెక్టులు చేసే ఆలోచన కూడా ఉందని చెప్పారాయన.
విజయనిర్మల బయోపిక్ చేయాలనేది తన కల అని చెప్పుకొచ్చారాయన. ఆ సినిమా కథ రాయగలిగితే నేనే రాస్తాను. అమ్మ కూడా ఆ మాటే చెప్పేది అని వివరించారు. అంతేకాదు కల్ట్ క్లాసిక్ సినిమాలు అయిన ‘చిత్రం భళారే విచిత్రం’, ‘శ్రీవారికి ప్రేమలేఖ’ సినిమాలకు సీక్వెల్‌చేయాలనేది తన కోరిక అని చెప్పారు. సినిమాల కోసం కథలు రాయడం మొదలుపెట్టానని, భవిష్యత్తులో డైరక్షన్ చేయాలనే ఆలోచన ఉందని చెప్పారు నరేశ్.