Naresh, Pavitra: నరేశ్‌ – పవిత్ర కలసి ప్రేమకథ చేస్తున్నారా?

టాలీవుడ్‌లో వైరల్‌ జోడీ ఎవరు అంటే… నరేశ్‌ – పవిత్ర లోకేశ్‌ అని ఠక్కున చెప్పేయొచ్చు. కారణాలేంటి, ఎందుకు అనేది పక్కనపెడితే.. ఇటీవల కాలంలో వైరల్‌ జోడీగా మారిపోయారు. అలాంటి నరేశ్‌, పవిత్ర కలసి నటించడం తొలిసారి కాదు.. కానీ త్వరలో వాళ్ల నుండి వస్తుంది అంటున్న సినిమా గురించి పెద్ద ఎత్తున బజ్‌ టాలీవుడ్‌లో ఏర్పడుతోంది. కారణం ఈ ఇద్దరిలో ఓ దర్శకుడు ప్రేమకథను సిద్ధం చేస్తున్నారని టాక్‌ రావడమే. టాలీవుడ్‌లో ఇప్పుడు దీని గురించే మాట్లాడుతున్నారు.

నరేశ్‌ – పవిత్ర లోకేశ్ ఎన్నో సినిమాల్లో భార్యభర్తలుగా నటించారు, అన్నాచెల్లెళ్లగా కూడా సినిమాలో కనిపించారు. అయితే తొలిసారి హీరో, హీరోయిన్‌గా యాక్ట్ చేయబోతున్నారట. గత కొంతకాలంగా ఈ ఇద్దరూ సహజీవనం చేస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది. ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏంటి అనేది చెప్పడం లేదు కానీ.. కొన్ని రోజుల క్రితం నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఈ ఇద్దరినీ ఓ హోటల్‌లో పట్టుకోవడం వైరల్‌ అయ్యింది.

మైసూర్‌లోని ఓ హోటల్‌లో నరేష్, లోకేష్ ఉండటం తెలుసుకున్న రమ్య రఘుపతి అక్కడ ఇద్దరినీ పట్టుకుని తిట్టేసింది. ఆ వీడియోలు మీడియలో, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పెద్ద రచ్చే జరిగింది. ఆ తర్వాత ఒకటి రెండు సందర్భాల్లో ఇద్దరూ బయటకనిపించినప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ మరణించగా.. అంత్యక్రియలు సమయంలోనూ ఇద్దరూ పక్కపక్కనే ఉన్నారనే విషయం అందరూ చూశారు.

ఈ సమయంలో ఓ దర్శకుడు నరేష్, పవిత్రను సంప్రదించారట. మెచ్యూర్డ్‌ లవ్‌ స్టోరీ కథ తన దగ్గర ఉందని.. దానికి మీరిద్దరూ సరిగ్గా సూట్‌ అవుతారని చెప్పారట. దీనికి నరేశ్‌ ఓకే చెప్పారు అని అంటున్నారు. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎదుర్కొన్న సవాళ్లతో ఇప్పటికే కథని సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి అందులో ఏం చూపిస్తారు, నరేశ్‌ – పవిత్రల జీవిత సన్నివేశాలు కూడా ఉంటాయా అనేది తెలియాల్సి ఉంది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus