Nari Nari Naduma Murari Collections: థియేటర్లు తక్కువైనా.. మొదటి వారానికే బ్రేక్ ఈవెన్ బాట పట్టిన ‘నారీ నారీ నడుమ మురారి’
- January 22, 2026 / 03:36 PM ISTByPhani Kumar
శర్వానంద్ హీరోగా సాక్షి వైద్య, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా రూపొందిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘నారీ నారీ నడుమ మురారి'(Nari Nari Naduma Murari). ‘ఏకె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘సామజవరగమన’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన రామ్ అబ్బరాజు ఈ సినిమాకి దర్శకుడు. సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.
Nari Nari Naduma Murari Collections
కంటెంట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో జనవరి 14 సాయంత్రం నుండే ప్రీమియర్ షోలు వేశారు. వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద తొలి రోజు ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది.రెండో రోజు నుండీ మరింత స్ట్రాంగ్ గా నిలదొక్కుకుంది.

అలా మొదటి వారం చాలా బాగా క్యాష్ చేసుకుంది.కానీ థియేటర్లు తక్కువగా ఉండటం అనేది ఒక డిజప్పాయింట్మెంట్ అని చెప్పాలి. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 3.43 cr |
| సీడెడ్ | 0.82 cr |
| ఆంధ్ర(టోటల్) | 4.75 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 9 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.70 cr |
| ఓవర్సీస్ | 2.78 cr |
| టోటల్ వరల్డ్ వైడ్ | 12.48 కోట్లు |
‘నారీ నారీ నడుమ మురారి'(Nari Nari Naduma Murari) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. చాలా ఏరియాల్లో నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. మొత్తంగా ఈ సినిమా రూ.12.5 కోట్ల షేర్ ను రాబడితే చాలు బ్రేక్ సాధించి క్లీన్ హిట్..గా నిలిచినట్టే. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.12.48 కోట్ల షేర్ ను రాబట్టింది.గ్రాస్ పరంగా రూ.23.10 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.0.57 కోట్ల షేర్ ను రాబట్టాలి.
‘మన శంకర వరప్రసాద్ గారు’ పై పవన్ కళ్యాణ్ రివ్యూ
















