Narne Nithin: మళ్ళీ తెరపైకి ఎన్టీఆర్ బావమరిది మొదటి సినిమా ప్రస్తావన?
- August 21, 2024 / 09:10 PM ISTByFilmy Focus
ఎన్టీఆర్ (Jr NTR) బావమరిది నార్నె నితిన్ (Narne Nithin) (Narne Nithin).. ‘మ్యాడ్’ (MAD) సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ మధ్యనే అతని రెండో సినిమాగా ‘ఆయ్’ (AAY) రిలీజ్ అయ్యింది. అది కూడా సక్సెస్-ఫుల్ గా రన్ అవుతుంది. ప్రస్తుతం అతను ‘మ్యాడ్ స్క్వేర్’ షూటింగ్లో బిజీగా గడుపుతున్నాడు. అది ‘మ్యాడ్’ కి సీక్వెల్ అనే సంగతి తెలిసిందే. అది కూడా సక్సెస్ అయితే నార్నె నితిన్ హ్యాట్రిక్ కొట్టేసినట్టే..! అప్పుడు అతని మార్కెట్ కూడా స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
Narne Nithin

ఇదిలా ఉంటే.. వాస్తవానికి నార్నె నితిన్ మొదటి సినిమా ‘మ్యాడ్’ కాదు ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’. నేషనల్ అవార్డు విన్నర్, ‘శతమానం భవతి’ (Shatamanam Bhavati) తో బ్లాక్ బస్టర్ అందుకున్న సతీష్ వేగేశ్న (Satish Vegesna) ఈ చిత్రానికి దర్శకుడు. ‘శ్రీ వేదాక్షర మూవీస్’ పతాకంపై చింతపల్లి రామారావు ఈ చిత్రాన్ని నిర్మించారు.మొన్నామధ్య ఈ సినిమాకి సెన్సార్ కంప్లీట్ అయ్యింది అని మేకర్స్ ప్రకటించారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ఈరోజు నిర్మాతలు వెల్లడించడం జరిగింది.

అయితే ఇటీవల ‘ఆయ్’ సినిమా ప్రమోషన్స్ లో హీరో నార్నె నితిన్ .. ‘ ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ స్క్రిప్ట్ వర్కౌట్ కాలేదు, షెల్వ్ అయిపోయింది(ఆగిపోయింది) ‘ అంటూ చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు దసరాకి విడుదల అంటూ నిర్మాత ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ రిలీజ్ అవ్వడం అనేది జరిగే పనేనా?’ అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

హీరో ‘ఈ సినిమా ఆగిపోయింది’ అని చెబితే.. నిర్మాతలు ఎలా రిలీజ్ చేస్తారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.? పైగా ఈ సినిమాకి హీరో తండ్రి నార్నె శ్రీనివాసరావు కూడా రూ.3.5 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారనే టాక్ ఉంది. అప్పుడు రిలీజ్ కి ఆయన కూడా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది కదా? మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.
















