బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ పోటీదారులకోసం రెండో టాస్క్ స్టార్ట్ అయ్యింది. దీని పేరు స్టిక్కర్ ఎటాక్. ఇందులో గెలిచిన టీమ్ నుంచీ ఇద్దరు కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక అవుతారని చెప్పాడు బిగ్ బాస్. రెండో కెప్టెన్సీ పోటీదారుల టాస్క్. ముగ్గురు సభ్యులు ఎంచుకోవాలి. కలర్ స్టిక్కర్స్ ఎటాక్ చేస్తూ అంటించాలి. ఎండ్ బజర్ కి ఆపేయాలి. ప్రతి రౌండ్ కి ముగ్గురు ముగ్గురు చొప్పున వస్తారు. అన్ని రౌండ్స్ అయిన తర్వాత కౌంటింగ్ లో ఎవరు ఎక్కువ స్టిక్కర్స్ అంటిస్తారో వాళ్లు విజేతలుగా నిలుస్తారు.
ఆ టీమ్ నుంచీ ఇద్దరినీ కెప్టెన్సీ పోటీదారులుగా ఎంచుకోవచ్చు. ఇక్కడే వారియర్స్ టీమ్ నుంచీ ముమైత్ ఖాన్ సంచాలక్ గా ఉంటే, ఛాలెంజర్స్ టీమ్ నుంచీ యాంకర్ శివ సంచాలక్ గా ఉన్నాడు. ఇక ఫస్ట్ రౌండ్ లో వారియర్స్ నుంచీ నటరాజ్ మాస్టర్, అషూరెడ్డి, సరయు లు ఎటాక్ చేశారు. ఛాలెంజర్స్ నుంచీ బిందుమాధవి, అనిల్, శ్రీరాపక ఎటాక్ చేశారు. తర్వాత రౌండ్ లో ఒకర్ని రీప్లేస్ చేయాల్సి వచ్చినపుడు అకిల్ అషూరెడ్డిని రీప్లేస్ చేశాడు. ఫస్ట్ రౌండ్ లో ఛాలెంజర్స్ గెలిచారు. నెక్ట్స్ రౌండ్ లో వారియర్స్ గెలిచారు.
దీంతో మూడో రౌండ్ చాలా ఇంట్రస్టింగ్ గా మారింది. ఇక్కడే మూడో రౌండ్ లో గేమ్ ఆడేటపుడు మాస్టర్ మీరు చేత్తో ని దించే బాగోదు చెప్తున్నా.. చాలా అంటూ ఆపేశాడు యాంకర్ శివ.. ఇక్కడే మాస్టర్ కి బాగా కాలింది. చాలా.. ఏం చేస్తావ్ చెప్పూ ఉంటే శివపై ఎగబడ్డారు. ఏం పీకుతావ్. నువ్వు తోలుతీస్తా.. నా బొంగు కూడా పీకలేవ్ అంటూ రెచ్చిపోయి శివతాండవం చేశారు నటరాజ్ మాస్టర్. ఇద్దరికీ సాలిడ్ ఆర్గ్యూమెంట్ అయ్యింది. ఇక్కడే సంచాలక్ అని మర్చిపోయి మరీ అరిచాడు శివ.
ఫస్ట్ యాంకర్ శివనే మాస్టర్ ని కెలికాడు. దీంతో ఆయన అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. నటరాజ్ మాస్టర్ గట్టిగట్టిగా అరుస్తూ యాంకర్ శివని ఒక ఆట ఆడుకున్నారు. అయితే, ఇక్కడే గేమ్ లో పాజ్ వస్తోందని అకిల్ కూడా యాంకర్ శివకి వార్నింగ్ ఇచ్చాడు. దీంతో శివ ముమైత్ ఖాన్ తో నటరాజ్ మాస్టర్ అలా మాటలు విసరడం నాకు నచ్చలేదని ఆయనకి చెప్పండి అంటూ మాట్లాడాడు. అలాగే, ఫిజికల్ గేమ్ పెట్టండి బిగ్ బాస్ మేము రెడీగా ఉన్నాం అంటూ రెచ్చిపోయాడు.
ఇక నటరాజ్ మాస్టర్ కూడా తనదైన స్టైల్లో రెచ్చిపోయి మరీ యాంకర్ శివపై ఫుల్ ఫైర్ అయ్యారు. ఈ టాస్క్ తర్వాత ముమైత్ ఖాన్ ఇద్దరినీ కూల్ చేసే ప్రయత్నం చేసింది. ఫైనల్ గా టాస్క్ గెలిచిన వారియర్స్ టీమ్ నుంచీ నటరాజ్ మాస్టర్ ఇంకా సరయు ఇద్దరూ కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక అయ్యారు. అదీ విషయం.