బిగ్ బాస్ హౌస్ లో నటరాజ్ మాస్టర్ తనదైన స్టైల్లో గేమ్ అడారు. ఎలిమినేట్ అయిపోతూ తన జెర్నీ చూసి చాలా ఎమోషనల్ అయ్యారు మాస్టర్. తన వైఫ్ నీతు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తన అవసరం ఉందని దేవుడు అలా చేశాడు అంటూ నాగార్జునతో చెప్పాడు. అంతేకాదు, ఏదో సాధించాలని హౌస్ లోకి వచ్చానని, సాధించకుండానే వెళ్లిపోతున్నానని చెప్పాడు నటరాజ్ మాస్టర్. దీనికి నాగార్జున బిగ్ బాస్ అనేది పెద్ద ఫ్లాట్ ఫార్మ్ అని ఇక్కడికి రావడమే సాధించడం అని చెప్పి మాస్టర్ ని సాగనంపారు.
అంతేకాదు, వెళ్లిపోతూ హౌస్ మేట్స్ కి రకరకాల యానిమల్స్ ని ఇచ్చి వాళ్లు ఎవరు చెప్పమని చెప్పాడు కింగ్ నాగ్. ఇక్కడే హౌస్ లో గుంటనక్క ఎవరు అనేది కూడా చాలా క్యూరియాసిటీగా అడిగాడు. ఇక నటరాజ్ మాస్టర్ ఒక్కో హౌస్ మేట్ కి ఒక్కో జంతువుని ఇస్తూ వాటితో పోలుస్తూ చాలా పాజిటివ్ హింట్స్ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్ లో సిరి పాములాంటిది అని తన జోలికి వస్తే మాత్రం బుసలుకొడుతూ పైకి లేస్తుందని చెప్పాడు. అలాగే, ఎలుక లోబో అని చెప్పాడు.
కిచెన్ లో దూరి అన్నీ తినేస్తుంటాడని , జాగ్రత్తగా గేమ్ ఆడమని సజెషన్ ఇచ్చాడు. చిలుక – ప్రియాంకకి, మొసలి శ్రీరామ్ చంద్రకి ఇచ్చాడు. ఇక్కడే శ్రీరామ్ గేమ్ మూడోవారం నుంచీ చాలా బాగుందని అలాగే ఆడమని, బలం పెంచుకోమని చెప్పాడు. ఇక హౌస్ లో ఊసరవెల్లిలా రంగులు మార్చేది విశ్వ అని చెప్పాడు నటరాజ్ మాస్టర్. ప్రతిదానికి భయపడొద్దని, వేరేవాళ్ల కోసం మంచిగా మాట్లాడమని అతడిని ఊసరవెల్లితో పోల్చాడు. అలాగే, మానస్ ని గాడిదతో పోల్చాడు.
అందరి పనులు కూడా తానే చేస్తుంటాడని, ఎప్పుడు పిలిచినా పనికి ముందు వరుసలో ఉంటాడని చెప్పాడు. ఇక అందరూ ఎదురూచూసే గుంటనక్క రవి అని కన్ఫార్మ్ చేసేశాడు. అయితే, తెలివితో ఆడుతున్న గుంటనక్క అని పాజిటివ్ గా చెప్పారు మాస్టర్. రవి గుంటనక్క అన్న విషయం ఫస్ట్ డేనే తెలుసని చెప్తే, నాగార్జున నాకు అయితే తెలీదంటూ చెప్పాడు. ఇక నాగార్జున తను శనివారం వేస్కున్న షర్ట్ ని హమీదాకి ప్రజెంట్ చేయడంతో ఎపిసోడ్ ముగిసింది. అదీవిషయం.