Nataraj, Bindu: మీ నాన్న కొద్దిగా నేర్పితే బాగుండేది..! బిందుపై నటరాజ్ మాస్టర్ ఫైర్..!

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ సెగ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 11వ వారం నామినేషన్స్ లో భాగంగా బిగ్ బాస్ టాప్ – 5కి వెళ్లే అర్హత లేని ముగ్గురు హౌస్ మేట్స్ ని ఎగ్జిట్ ఫ్రేమ్ కింద నిలబెట్టి తగిన కారణాలు చెప్పమని చెప్పాడు. దీంతో ఒక్కో హౌస్ మేట్ ముగ్గుర్ని ఫ్రేమ్ కింద నిలబెట్టి తగిన కారణాలు చెప్పే ప్రయత్నం చేశారు. మొదట బిందు మాధవి మిత్రాని నిలబెట్టింది. తను ఏది డ్రామా చేస్తుంది ? ఏది నిజంగా ఫీల్ అవుతుందో తెలియడం లేదని, శారీరకంగా – మానసికంగా , వ్యక్తిత్వంగా అర్ధం కాలేదని, టాప్ – 5 కి వెళ్లే అర్హత లేదని చెప్పింది.

అలాగే, అఖిల్ ని కూడా నిలబెట్టి వాళ్ల మద్యలో ఉన్న ఇష్యూని మరోసారి ఫ్రేమ్ లోకి తీస్కుని వచ్చింది. దీంతో ఇద్దరూ ఆర్గ్యూ చేసుకున్నారు. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేసేసరికి ఇద్దరి మద్యలో ఆర్గ్యూమెంట్స్ అయ్యాయి. మాస్టర్ ఎమోషనల్ గా మీరు హౌస్ మేట్స్ ని గేమ్ ఆడనివ్వకుండా చేస్తున్నారని, మేము గేమ్ ఆడేటపుడు మీ ఎమోషన్ కి భయపడతున్నామంటూ మాట్లాడింది. దీంతో మాస్టర్ మాటకి మాట చెప్పడం ప్రారంభించారు. ఒకానొక దశలో ఇద్దరి మద్యన వాదన పర్సనల్ గా వెళ్లిపోయింది.

మీ నాన్నగారు నిన్ను సరిగ్గా పెంచలేదని, ఆడపులి నువ్వు కాదని, బయట వాళ్లకి డబ్బులిచ్చి సోషల్ మీడియాలో ఓట్లు వేసుకుంటూ ఉన్నావంటూ మాస్టర్ ఫైర్ అయ్యారు. అంతేకాదు, నీలాంటి వాళ్లని అసలు తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారు అంటూ రెచ్చిపోయారు. నువ్వు గేమ్ అవ్వగానే చెన్నై వెళ్లిపోతావని, మేము మాత్రం ఇక్కడ 20 యేళ్ల నుంచీ ఉంటున్నామని మాట్లాడారు. నువ్వు హీరోయిన్ గా ఫెయిల్ అయ్యావ్, మీ నాన్నగారు నిన్ను పెంచడంలో ఫెయిల్ అయ్యారంటూ ఆర్గ్యూమెంట్ ని పర్సనల్ గా తీస్కుని వెళ్లారు.

బిందు మాధవి మాటకి మాట చెప్తుంటే తీస్కోలేకపోయారు. మీరు కూడా అస్తమానం మీ కూతురు కోసం గేమ్ ఆడుతున్నానంటూ అన్నారు అని, అందరికీ ఫ్యామిలీ ఉందని, నేను కూడా మా నాన్నకి కూతురునే అని మాట్లాడింది బిందు. నేను నాగార్జునగారికి చెప్పి మరీ షోలోకి వచ్చాను అని, ముఖ్యంగా నేను తెలుగు బిడ్డని అంటూ ప్రాంతీయ భావాన్ని కూడా తీస్కుని వచ్చారు. బాబాభాస్కర్ వచ్చిన దగ్గర్నుంచీ బిందు కిచెన్ లో ఉంటోందని, అంతకుముందు ఒక్కసారి కూడా రాలేదని మాట్లాడారు మాస్టర్. అలాగే, అసలు నువ్వు నాలుగోవారమే ఎలిమినేట్ అవ్వాల్సింది.

ఇంత దూరం ఎలా వచ్చావో తెలియడం లేదని, నేను బయటకి వెళ్తే నిన్ను షోలో లేకుండా చేస్తానంటూ రెచ్చిపోయారు. నామినేషన్స్ అయిపోయిన తర్వాత కూడా కెమెరాలకి వెళ్లి బిందు మాధవి గేమ్ గురించి మాట్లాడారు. బెడ్ పైన పడుకుని కాళ్లు ఊపుకుంటూ ఇంత దూరం వచ్చేశావని, మేము కష్టపడి గేమ్ ఆడుతున్నామని, నువ్వు అసలు ఏం గేమ్ ఆడావో చెప్పమని మాట్లాడారు మాస్టర్. అంతేకాదు, తన మనసులో ఉన్నవన్నీ కూడా కక్కేశారు. వీరిద్దరి ఆర్గ్యూమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి చూద్దాం ఎవరు ఈవారం నామినేషన్స్ లోకి వస్తారు అనేది.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus