ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శేఖర్ మాస్టర్ గత కొద్ది రోజుల క్రితం మరణించిన విషయం మనకు తెలిసిందే. ఎన్నో అద్భుతమైన పాటలకు కొరియోగ్రఫీ అందించి కొరియోగ్రాఫర్ గా పేరు ప్రఖ్యాతలు పొందటమే కాకుండా ఎంతోమంది కొరియోగ్రాఫర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత రాకేష్ మాస్టర్ కి చెల్లిందని చెప్పాలి. ఇలా కొరియోగ్రాఫర్ గా ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడిపినటువంటి ఈయన గత కొంతకాలంగా సినిమా అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలుస్తోంది.
దీంతో ఈయన యూట్యూబ్ ఛానల్ లకు ఇంటర్వ్యూ ఇస్తూ పలువురు సినీ సెలబ్రిటీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచారు. ఇకపోతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ రాకేష్ మాస్టర్ గాంధీ హాస్పిటల్ లో చేరారు. ఇలా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఈయన మరణించడంతో మాస్టర్ మరణం పట్ల ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఇలా రాకేష్ మాస్టర్ మరణించడంతో ఆయన శిష్యులు ఈయన మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఇక తాజాగా ఆయన పెద్దకర్మ వేడుక జరిగింది.ఈ కార్యక్రమానికి (Rakesh Master) రాకేష్ మాస్టర్ శిష్యులు ఇతర కొరియోగ్రాఫర్లు కూడా హాజరై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాకేష్ మాస్టర్ ఇండస్ట్రీకి ఎన్నో సేవలు చేయడమే కాకుండా ఎంతోమంది శిష్యులను తీర్చిదిద్ది ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇలాంటి ఒక గొప్ప గురువుగారి సేవలను ఎప్పటికీ మరవకూడదన్న ఉద్దేశంతో ప్రతి ఏడాది రాకేష్ మాస్టర్ పేరిట జాతీయ పురస్కారాలను ప్రకటించబోతున్నట్లు ఈ సభలో తెలియజేశారు.
ఇక ఈ విషయాన్ని తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా టెక్నిషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక ప్రెసిడెంట్ నాగబాల సురేష్ కుమార్ బుధవారం హైదరాబాద్ లో రాకేష్ మాస్టర్ పెద్దకర్మ సందర్భంగా ప్రకటించారు.