బాహుబలి, కంచె చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా చాటి జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి, జాగర్లమూడి క్రిష్. భారీ బడ్జెట్, తారాగణం, హై రేంజ్ టెక్నికల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కిన తెలుగు చిత్రం బాహుబలి ది బిగినింగ్ వరల్డ్ వైడ్ గా తెలుగు సినిమాకు గుర్తింపు తెచ్చింది. అలాగే రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో జాగర్లమూడి క్రిష్ రూపొందించిన చిత్రం కంచె.
బాహుబలి ఉత్తమ చిత్రం, కంచె చిత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డులను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా బాహుబలి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు అందుకున్నారు. అలాగే కంచె చిత్రానికి సంబంధించి క్రిష్ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి బాహుబలి కన్ క్లూజన్, క్రిష్ బాలకృష్ణ వందవ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాలను రూపొందిస్తునారు. ఇలా రాజమౌళి, క్రిష్ లు తమ దర్శకత్వ ప్రతిభతో తెలుగు సినిమాను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటూ తెలుగు చిత్రసీమ తరపున వారికి అభినందనలు.