Bigg Boss 5 Telugu: జెస్సీ పై నటరాజ్ మాస్టర్ కి ఎందుకంత కోపం..!

బిగ్ బాస్ హౌస్ టాస్క్ లు ఆడేటపుడు ఒకలాగా, నామినేషన్స్ అప్పుడు ఇంకోలాగా కనిపిస్తుంది. ముఖ్యంగా టాస్క్ లు ఆడేటపుడు ఒకరిపై ఒకరికి ఎంతో కోపం ఉన్నట్లుగా ఫిజికల్ గా కలయబడిపోతారు. అలాగే నామినేషన్స్ అప్పుడు బద్ద శత్రువుల్లా ఒకరిపై ఒకరు విరుచుకుపడతారు. మాటలతోనే యుద్ధం చేస్తారు. బిగ్ బాస్ హౌస్ లో మూడోవారం నామినేషన్స్ లో నటరాజ్ మాస్టర్ తన తిక్కని చూపించారు. చాలా రియాలిటీషోలు చేసాం.. కానీ ఇది పెద్ద ఫ్లాట్ ఫార్మ్ అంతే తేడా అంటూ పవన్ కళ్యాణ్ స్టైల్లో డైలాగ్స్ చెప్పారు. ముఖ్యంగా జెస్సీ నామినేషన్స్ అప్పుడు కౌంటర్ ఎటాక్ చేశారు నటరాజ్ మాస్టర్.

జెస్సీ వాల్ ఆఫ్ షేమ్ పైన నటరాజ్ మాస్టర్ , మానస్ పేర్లు చెప్పి నేను అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదని అన్నారు. లాస్ట్ వీక్ నేను చెప్దాం అనుకున్నా కానీ నాకు ఆ ఆప్షన్ రాలేదు అంటూ నటరాజ్ మాస్టర్ ని మానస్ ని నామినేట్ చేశాడు. ఇన్నిరోజులు ఇన్ని గేమ్స్ లో కనిపించలేదు. నువ్వు ఎందుకు మేలుకున్నావో నాకు తెలుసు. నువ్వు ఎవరు చెప్తే నామినేట్ చేస్తున్నావో కూడా నాకు తెలుసు అంటూ మాట్లాడారు నటరాజ్ మాస్టర్. జెస్సీపై తన విశ్వరూపం చూపించారు. ఒకరు చెప్తే కాదు నీ గేమ్ నువ్వు ఆడు అన్నారు. నువ్వు మనసులో పెట్టుకుని చూశావంటే ఇదే కలర్ అంటూ అన్నారు.

ఇక్కడే నాకు ఒక తిక్కుంటుంది.. అది రేగిందంటే లెక్కలు మారిపోతాయ్ 100 పర్సెంట్ అంటూ రెచ్చిపోయారు మాస్టర్. చిన్నపిల్లోడివి జుజ్జూ.. జుజ్జూ.. అంటూ జెస్సీపై కామెంట్స్ చేశారు. పక్కకెళ్లి ఆడుకోమ్మా అంటూ రెచ్చిపోయారు మాస్టర్. ఇక జెస్సీ కూడా నటరాజ్ మాస్టర్ కి సాలిడ్ కౌంటర్ వేశాడు. ఇక్కడ సిరి మాటలకి జెస్సీ ఇన్ఫులెన్స్ అయ్యాడా అనే పాయింట్ ని నటరాజ్ మాస్టర్ తీస్కుని వచ్చారు. నామినేషన్స్ తర్వాత గార్డెన్ ఏరియాలో మాట్లాడుతూ, ఏదో పాయింట్ దొరికింది కదా అని అలా చేయకూడదని, నేను చాలా రియాలిటీషోలు చేసే ఇక్కడి వచ్చానంటూ ఫైర్ అయ్యారు మాస్టర్.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus