Navdeep: ‘గడ్డం తెల్ల‌బ‌డితే చేసుకోవాల్సింది ట్రిమ్మింగ్.. పెళ్లి కాదు’: నవదీప్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎన్నో సినిమాలు చేసిన నవదీప్ తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. ఈ మధ్యకాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి కొన్ని సినిమాల్లో కనిపించాడు. 18 ఏళ్ల తన సినీ ప్రయాణంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో కనిపించాడు. అల్లు అర్జున్ నటించిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమాలో బన్నీ ఫ్రెండ్ క్యారెక్టర్ లో కనిపించాడు. ఆ తరువాత ‘మోసగాళ్లు’ సినిమాలో కూడా నటించాడు. ఇప్పుడు సన్నీలియోన్ నటిస్తోన్న ‘వీరమహాదేవి’ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు.

అలానే ఓటీటీలో కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ హీరో ఇప్పటివరకు పెళ్లి ఊసెత్తడం లేదు. గతంలో ఒకరిద్దరితో ఎఫైర్స్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి కానీ పెళ్లి గురించి మాత్రం ఈ నటుడు పెద్దగా ఆలోచించడం లేదు. ఈ క్రమంలో ఆయన గడ్డం నెరిసిపోతుందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ‘గ‌డ్డం తెల్ల‌బడుతుంద‌న్నా.. పెళ్లి చేసుకోండంటూ’ సలహాలు ఇస్తున్నారు. దీనిపై ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు నవదీప్. తన గడ్డాన్ని షేవ్ చేసుకొని ఓ వీడియో పోస్ట్ చేశాడు.

దానికి ‘వద్దురా సోదరా’ అని క్యాప్షన్ పెట్టాడు. ‘అన్నా గ‌డ్డం తెల్ల‌బ‌డుతోంది త్వ‌ర‌గా పెళ్లి చేసుకోండి అంటూ స‌ల‌హాలు ఇస్తున్నారు కొంద‌రు. గడ్డం తెల్ల‌బ‌డితే చేసుకోవాల్సింది ట్రిమ్మింగ్ కానీ పెళ్లి కాదు. దుర‌ద పెడితే గోక్కుంటాం కానీ తోలు పీక్కోం క‌దా అలాగే’ అంటూ పెళ్లి చేసుకోనని క్లారిటీగా చెప్పేశారు. ఈ లెక్కన చూస్తుంటే చాలా మంది తెలుగు హీరోల మాదిరిగానే పక్కా బ్యాచిలర్ గా ఉండిపోయేలా ఉన్నాడు నవదీప్. ప్రస్తుతం ఆయన ఫన్నీ రియాక్షన్ వైరల్ అవుతోంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus