Navdeep: టాలీవుడ్ హీరో నవదీప్ పై డ్రగ్స్ కేసు.. ఏమైందంటే?
- September 15, 2023 / 05:22 AM ISTByFilmy Focus
టాలీవుడ్ హీరో నవదీప్ పేరు మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నట్టు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని… హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రకటించినట్టు అంతా చెప్పుకుంటున్నారు. డ్రగ్స్ వాడే కస్టమర్స్ లిస్ట్ లో నవదీప్ పేరు ఉందని.. ఇతనితో పాటు ఇంకా చాలా మంది సినీ ప్రముఖులు డ్రగ్స్ తీసుకున్నారని చర్చలు జరుగుతున్నాయి. ఈ కేసులోనే మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్ కూడా అరెస్ట్ అయినట్టు సీపీ సీవీ ఆనంద్ చెప్పుకొచ్చారు.
ఇంకా ఈ కేసులో నవదీప్ స్నేహితుడు రాంచంద్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారట. గతంలో జరిగిన ఈడీ విచారణలో కూడా నవదీప్ హాజరైనట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రచారాన్ని నవదీప్ ఖండించారు. తన ట్విట్టర్ ద్వారా పరోక్షంగా ఈ విషయంపై స్పందించాడు నవదీప్. ‘నేను ఎక్కడికి పారిపోలేదు, హైదరాబాద్‌లోనే ఉన్నాను.దయచేసి సరిగ్గా చెక్ చేసుకోండి’ అంటూ ఈ కేసుతో తనకు సంబంధం లేదు అన్నట్టు చెప్పుకొచ్చాడు. ఇక సినిమాల విషయానికి వస్తే..

నవదీప్ నిర్మాతగా కూడా మారి ‘సగిలేటి కథ’ అనే సినిమాని తెరకెక్కించాడు. త్వరలోనే ఆ సినిమా రిలీజ్ కాబోతుంది. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నవదీప్ పలు సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. గతంలో హీరోగా ‘చందమామ’ ‘గౌతమ్ ఎస్ ఎస్ సి’ ‘మొదటి సినిమా’ వంటి మంచి సినిమాల్లో అతను నటించాడు. తర్వాత ‘ఆర్య 2 ‘ ‘బాద్ షా’ ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే సినిమాల్లో కూడా నటించాడు. బిగ్ బాస్ సీజన్ 1 లో కూడా ఇతను ఓ కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే.
That’s not me gentlemen
I’m right here .. pls clarify thanks— Navdeep (@pnavdeep26) September 14, 2023
బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!















