Prabhas: ప్రభాస్ ఈవెంట్ కోసం నవీన్ పొలిశెట్టి ఎంత తీసుకున్నాడంటే?

ఇటీవల ప్రభాస్ రాధేశ్యామ్ ఈవెంట్ లో అందరికంటే ఎక్కువగా నవీన్ పొలిశెట్టి తన మాటలతో హావభావాలతో ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. మొత్తానికి ఈవెంట్ సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారకూడయ్యాడు. అందరితో అల్లరి చేస్తూ ప్రభాస్ భుజంపై చేయి వేసి మాట్లాడాడు. ఇద్దరి స్నేహాన్ని చూసి ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే నవీన్ పొలిశెట్టి వేడుకకు పిలిచారా? లేక అతనే వచ్చాడా? అని అందరిలో ఒక సందేహం కొనసాగుతోంది.

ప్రభాస్ కు ఈ ఐడియా ఇచ్చింది మరెవరో కాదు. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ దర్శకుడు ప్రస్తుతం ప్రభాస్ తో ప్రాజెక్ట్ K చేస్తున్నాడు. అయితే ఈవెంట్ పాన్ ఇండియా రేంజ్ లో ఆకట్టుకోవాలి అంటే ముఖ్యమైన బాషలపై పట్టున్న నవీన్ బెస్ట్ అని చెప్పారట. ఎందుకంటే నవీన్ బాలీవుడ్ ఆడియెన్స్ కు కూడా బాగా తెలుసు. అతను చేసిన చిచ్చోరే సినిమాలో చేసిన రోల్ హింది ఆడియేన్స్ అంత ఈజీగా మర్చిపోలేరు.

జాతిరత్నాలు సినిమాను నాగ్ అశ్విన్ నిర్మాతగా ఉండగా ఆ సినిమా ప్రమోషన్ లో నవీన్ టాలెంట్ గురించి అర్ధమయ్యింది. ఇక ప్రభాస్ కూడా కరెక్ట్ అనుకున్నాడు. ఇక నాగ్ అశ్విన్ ఆ విషయాన్ని ప్రస్తావించే సమయంలోనే నవీన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ఈ వేడుకకు నవీన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. కేవలం ప్రభాస్ మీద అభిమానంతోనే చేసినట్లు తెలుస్తోంది. జాతిరత్నాలు సమయంలో ప్రభాస్ చేసిన సహాయాన్ని గుర్తు పెట్టుకొని నవీన్ ఆ విధంగా హోస్టింగ్ తో ఈవెంట్ హైలెట్ అయ్యేలా చేశాడు.

పోటీగా గ్లామర్ బ్యూటీ రేష్మి ఉన్నా కూడా నవీన్ చాలా డామినేట్ చేశాడు అనే చెప్పాలి. ఇక ఇన్ని రోజులు యూఎస్ లో ఉన్న నవీన్ మళ్ళీ సినిమాలతో బిజీ అవ్వాలని ఇండియా వచ్చేశాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ ప్రొడక్షన్ లో ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ సినిమాకు జాతిరత్నాలు సినిమాకు వర్క్ చేసిన సహాయక దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నట్లు సమాచారం.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus