కరోనా టైములో సినీ పరిశ్రమ నుండీ ఎంతో మంది సెలబ్రిటీలు సామాన్యులకు సాయం చేశారు.ఈ లిస్ట్ లో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కూడా ఉన్నాడు. అత్యవసరం,నిత్యావసరం.. అంటూ వేడుకున్న ప్రతీ ఒక్కరినీ ఇతను ఆదుకున్నాడు.తరచూ బాధితులతో వీడియో కాల్స్ లో మాట్లాడి వాళ్లకు ధైర్యం చెబుతూ తనకి వీలైనంత సహాయం చేస్తూ వచ్చాడు.ఇప్పటికీ ఎంతో మందికి అతను సాయం చేస్తూనే ఉన్నాడు.ఇదిలా ఉండగా…లాక్ డౌన్ టైమ్ లో ఉద్యోగం కోల్పోయిన సమీర్ అనే యువకుడు ఇబ్బందుల్లో ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకున్న నవీన్ పోలిశెట్టి..
ఆ యువకుడి వివరాలతో ఓ ట్వీట్ వేసాడు. ఈ ట్వీట్ కు ‘ఈ వోక్ – వేగాన్ స్టోర్ అండ్ కేఫ్’ వారు స్పందించి సమీర్ కు స్టోర్ మేనేజర్ గా ఉద్యోగాన్ని ఇచ్చారు.ఈ క్రమంలో సమీర్ కు ‘ఈ వోక్ – వేగాన్ స్టోర్ అండ్ కేఫ్’ వారు పంపిన ఆఫర్ లెటర్ ను హీరో నవీన్ పోలిశెట్టి ట్వీట్ చేసి.. ‘నాకు సమీర్ పరిస్థితిని తెలియజేసిన నెటిజన్లు… చరణ్, సౌమ్య లకు థాంక్స్’ అంటూ పేర్కొన్నాడు.
అలాగే ‘త్వరలో నేను కూడా ఆ స్టోర్ కు వెళ్తాను.ఈ పాండమిక్ టైమ్ లో ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు ఇంకా చాలా మందే ఉన్నారు.కాబట్టి.. వీలైనంత మందికి ఉద్యోగాలు వచ్చేలా మనవంతు సాయం చేద్దాం’ అంటూ నవీన్ పోలిశెట్టి పేర్కొన్నాడు.