Nayakudu: నాయకుడు తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్!

తమిళ్ లో రీసెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది మామన్నన్ మూవీ. ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్… ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో వడివేలు, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం అక్కడ పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి.. మంచి ఓపెనింగ్స్ ను సాధించింది. అటు తర్వాత కూడా పాజిటివ్ టాక్ పవర్ తో స్ట్రాంగ్ గా రన్ అయ్యి .. రూ.60 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ ను సాధించింది.

జూలై 14 న ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది. హీరోకి ఇక్కడ చెప్పుకోదగ్గ ఇమేజ్ లేదు.. దీంతో ఇక్కడ మోస్తరు బిజినెస్ జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :

నైజాం 0.40 cr
సీడెడ్ 0.25 cr
ఆంధ్ర 0.35 cr
ఏపి + తెలంగాణా 1.00 cr

నాయకుడు (Nayakudu) చిత్రానికి తెలుగులో రూ.1.0 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే.. రూ.1.3 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. తెలుగులో కూడా పాజిటివ్ టాక్ ను కనుక రాబట్టుకుంటే.. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంటుంది. టార్గెట్ కూడా పెద్దదేమి కాదు. కానీ పోటీగా రిలీజ్ అయిన సినిమాలు మరోపక్క విస్తారంగా కురుస్తున్న వర్షాలు వంటి వాటిని అధిగమించి ఈ మూవీ ఆ ఫీట్ ను సాధిస్తుందో లేదో చూడాలి.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus