Nayanatara: నయనతార అబద్ధాలు చెప్పి మోసం చేసిందా?

స్టార్ హీరోయిన్ నయనతార ఈ మధ్య కాలంలో తరచూ వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం. పెళ్లి తర్వాత నయనతార తరచూ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూ అభిమానులకు షాకిస్తున్నారు. పెళ్లైన నాలుగు నెలలకే నయనతార సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనివ్వడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. సెలబ్రిటీ అయిన నయనతార విమర్శలకు ఛాన్స్ ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే సరోగసి వివాదం విషయంలో నయనతారకు క్లీన్ చిట్ రావడంతో ఆమె ఫ్యాన్స్ సంతోషించారు.

అయితే కొంతమంది మాత్రం ఆరేళ్ల క్రితమే నయనతారకు పెళ్లైతే ఇప్పటివరకు ఆ విషయాన్ని ఎందుకు వెల్లడించలేదంటూ సందేహం వ్యక్తం చేశారు. అయితే నయనతార విఘ్నేష్ శివన్ కొన్నేళ్ల క్రితం విదేశాల్లోని ఒక కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఆ సమయంలో నయన్ విఘ్నేష్ తమకు పెళ్లి కాలేదని అందులో పేర్కొన్నారు. అప్పుడు పెళ్లి కాలేదని అంగీకరించిన నయన్ విఘ్నేష్ ఇప్పుడు మాత్రం భిన్నంగా వ్యవహరించడం ఏంటని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

తమపై కేసులు నమోదు కాకుండా ఉండటానికి మాత్రమే నయన్ విఘ్నేష్ ఫేక్ మ్యారేజ్ సర్టిఫికెట్ ను సృష్టించారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సరోగసి ద్వారా పిల్లల్ని కనడానికి గల కారణాలను నయనతార వెల్లడించాల్సి ఉందని మరి కొందరు చెబుతున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయనతార కెరీర్ విషయంలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఒక్కో ప్రాజెక్ కు 10 కోట్ల రూపాయల స్థాయిలో నయనతార పారితోషికం ఉండగా సౌత్ ఇండియాలో ఈ స్థాయి పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ నయనతార మాత్రమే కావడం హాట్ టాపిక్ అవుతోంది. విఘ్నేష్ శివన్ కెరీర్ మాత్రం ఆశాజనకంగా లేకపోవడం గమనార్హం.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus