Nayanathara, Vignesh Shiva: పెళ్లే కాదు వెకేషన్ కోసం రూపాయి ఖర్చు చేయని దంపతులు!

Ad not loaded.

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నయనతార గత రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో అగ్ర తారగా కొనసాగుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇకపోతే గత ఏడు సంవత్సరాలుగా ఈమె దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమలో ఉన్నటువంటి ఈమె జూన్ 9వ తేదీ తనని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి స్థిరపడ్డారు. వివాహం తర్వాత హనీమూన్ కోసం థాయిలాండ్ వెళ్లిన ఈ జంట ప్రస్తుతం విదేశీ పర్యటనలలో ఎంతో బిజీగా గడుపుతో వారి పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ దంపతులు స్పెయిన్ పర్యటనకు వెళ్ళిన విషయం మనకు తెలిసిందే ఈ క్రమంలోనే అక్కడి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇకపోతే పెళ్లి తర్వాత నయనతార పూర్తిగా గ్లామర్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో పలువురు నెటిజన్ లు ఈ ఫోటోలపై స్పందిస్తూ అదేంటి నయనతార ఇలా మారిపోయింది అంటూ ఆమె వస్త్రధారణ పై కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ దంపతులకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నయనతార విగ్నేష్ పెళ్లి వేడుకను ప్రముఖ ఓటీటీ సమస్థ నెట్ఫ్లిక్స్ భారీ ఖర్చు చేసి వీరి పెళ్లి చేయడమే కాకుండా ఈ పెళ్లి వేడుకను వారు సొంతం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈ దంపతులు విదేశీ పర్యటనలలో విహరిస్తూ ఉన్నారు.అయితే ఈ వెకేషన్ కి ఈ దంపతులు ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా పూర్తిగా ఉచితంగా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం స్పెయిన్ లో ఈ జంట నివసిస్తున్నటువంటి హోటల్ అద్దె ఒక రోజుకు రెండున్నర లక్ష రూపాయలట. ఈ ఖర్చులతో పాటు వీరి ఇతరత ఖర్చులన్నింటినీ కూడా ప్రముఖ సంస్థ స్పాన్సర్‌ చేస్తోందని, ఫలితంగానే విదేశీ విహార యాత్ర చేస్తోందని గుసగుసలు. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నయనతార పెళ్లి మాత్రమే కాదు వీరి హాలిడే వెకేషన్ కి కూడా రూపాయి ఖర్చు చేయకుండా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారని భావిస్తున్నారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus