నయనతార కొత్త సినిమా మొదలు కాకముందే విమర్శలు

  • May 18, 2018 / 02:29 PM IST

గ్లామర్ రోల్స్ తో పాటు లేడి ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి నయనతార మంచి పేరుతెచ్చుకుంటోంది. దక్షిణాది సినీ పరిశ్రమల్లో టాప్ హీరోయిన్ గా నిలిచిన ఈ భామ ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తోంది. తొలిసారి మెగాస్టార్ కి జోడీగా కనిపించనుంది. ఇంతటి భారీ సినిమాలో మంచి పాత్ర పోషిస్తున్న నయన తాజాగా ఒక విభిన్న రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ రోల్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎందుకంటే అది డ్రగ్స్ అమ్మే పాత్ర కాబట్టి. స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈమె “కొలమావు కోకిల” అనే చిత్రంలో డ్రగ్స్ అమ్మే పాత్రలో కనిపించడమేంటి అని విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ సినిమాలో లీడ్ పాత్ర గురించి దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ చెప్పగానే మరో ఆలోచన లేకుండా వెంటనే ఈ సినిమా చేయడానికి నయనతార ఓకే చెప్పిందంట. అంత గొప్పగా నయన పాత్ర ఈ సినిమాలో ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఓ యువతి, ఎలా స్మగ్లింగ్ వైపు వెళ్లిందనే లైన్ తో ఈ సినిమా తెరకెక్కనుందని పేర్కొంది. ఈ సినిమాలో నయనతార నటనకు అవార్డులు గ్యారంటీ అని చిత్ర బృందం ధీమాగా చెబుతోంది. ఈ పాత్ర ఒప్పుకోవడంపై నయన అభిమానుల్లో కొంతమంది కోపంగా ఉంటే.. మరికొంతమంది ఆమెను అభినందిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus