నయనతార (Nayanthara) జీవితంపై నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైన డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ ఎంతటి హైప్ ను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఈ డాక్యుమెంటరీ చుట్టూ వివాదాలు ఎప్పటికప్పుడు రేగుతూనే ఉన్నాయి. ఇటీవల నయనతార దంపతులు ‘చంద్రముఖి’ (Chandramukhi) చిత్రంలోని విజువల్స్‌ను అనుమతి లేకుండా వాడారంటూనెట్‌ఫ్లిక్స్‌పై చంద్రముఖి నిర్మాతలు లీగల్ నోటీసులు పంపించారనే వార్తలు బయటకు రావడం సంచలనంగా మారింది. వార్తల ప్రకారం, నిర్మాతలు రూ.5 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేసినట్లు ప్రచారం జరిగింది.
Nayanthara
కానీ ఈ పరిణామాలపై శివాజీ ప్రొడక్షన్స్ సంస్థ స్పందిస్తూ అసలు విషయం వెలుగులోకి తెచ్చింది. సంస్థ అధికార ప్రతినిధి మాట్లాడుతూ..“మా నుంచి ఎలాంటి నోటీసులు వెళ్లలేదు. డాక్యుమెంటరీ కోసం ముందే ఎన్ఓసీ ఇచ్చాం. 17 సెకన్ల ఫుటేజ్ వాడుకోవడానికి అనుమతి ఉంది. రూ.5 కోట్ల డిమాండ్ అన్నది పూర్తిగా అవాస్తవం” అని పేర్కొన్నారు. ఈ వివరణతో నయనతారపై వచ్చిన లీగల్ ఇష్యూలకు పుల్‌స్టాప్ పడింది. కానీ ఇదే సమయంలో, మరో వివాదం నయనతారను చేరుకుంది.
‘నేనూ రౌడీనే’ చిత్రంలోని 3 సెకన్ల బీటీఎస్ ఫుటేజ్‌ను అనుమతి లేకుండా వాడారంటూ హీరో ధనుష్ (Dhanush) కోర్టును ఆశ్రయించారు. రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపించారు. ఈ కేసు ప్రస్తుతం మద్రాస్ హైకోర్టు పరిధిలో కొనసాగుతోంది. కోర్టు జనవరి 8వ తేదీ లోపు నయనతార దంపతులు, నెట్‌ఫ్లిక్స్ సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీలో నయనతార సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితంలోని ముఖ్య సంఘటనలను ప్రాముఖ్యంగా చూపించారు. ఆమె ప్రేమ జీవితం, పెళ్లి నేపథ్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, అనుమతులు తీసుకోకుండా కొన్ని ఫుటేజ్‌లను వాడడం సమస్యల కారణంగా మారింది.