Nayanthara: నిర్మాతలకు భారీ కండిషన్స్ పెట్టిన నయనతార?

లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి తర్వాత వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈమె ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా నయనతార వివాహం తర్వాత సినిమాలు చేయదంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి అయితే ఇవి పూర్తిగా అవాస్తవమని నయనతార చెప్పకనే చెప్పేశారు. ఇలా వరుస సినిమాలతో ఈమె ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే ఏడు సంవత్సరాల నుంచి విగ్నేష్ శివన్ ప్రేమలో ఉన్నటువంటి నయనతార జూన్ నెలలో తనని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

ఇలా ఒకవైపు వ్యక్తిగత జీవితంలోను మరోవైపు వృత్తిపరమైన జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.దక్షిణాది సిని ఇండస్ట్రీలోని అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న నయనతార వివాహం తర్వాత తన రెమ్యూనరేషన్ భారీగా పెంచేశారు. ఇప్పటివరకు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఏడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఎవరు తీసుకోలేదు. అలా తీసుకోవడం కేవలం నయనతారకు మాత్రమే చెల్లిందని చెప్పాలి. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు నయనతార ఏడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

అయితే తన తదుపరి సినిమాకు ఈమె ఏడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడమే కాకుండా మరికొన్ని డిమాండ్స్ చేయడంతో నిర్మాతలు సైతం షాక్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఓ నిర్మాత నయనతార వద్దకు సినిమా పని నిమిత్తం వెళ్లడంతో ఈమె ఏడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడమే కాకుండా తనతో పాటు వచ్చే టీమ్ మెంబర్స్ కి ఫ్లైట్ టికెట్స్ తో పాటు లగ్జరీ హోటల్ ప్రత్యేకంగా కేరవాన్ వంటి సదుపాయాలన్నింటినీ కల్పించాలని ఈమె డిమాండ్ చేశారు.

ఇలా నయనతార డిమాండ్స్ విన్న నిర్మాత ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.ఇలా నయనతారకు 7 కోట్లు చెల్లించి మరి ఇతర ఖర్చులు అన్నింటినీ భరించాలంటే ఈమె కోసం ఏకంగా 10 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus