Nayanthara: ఒకే ఒక టాలీవుడ్ హీరోయిన్ ను ఫాలో అవుతున్న నయన్!

  • September 2, 2023 / 03:31 PM IST

సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటినైన తార ఒకరు ఈమె ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్న ఇప్పటికీ సినిమా అవకాశాలను అందుకుంటూ అందరికన్నా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటూ టాప్ హీరోయిన్గా కొనసాగుతున్నారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి నయనతార ఇన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.ఇకపోతే తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టారు.

ఇలా ఇంస్టాగ్రామ్ లోకి అడుగు పెట్టినటువంటి (Nayanthara) నయనతార తన మొదటి పోస్టులో భాగంగా తన కవల పిల్లలతో ఉన్న ఓ వీడియోని షేర్ చేసింది. ఈ వీడియో అనంతరం జవాన్ సినిమాకు సంబంధించి కొన్ని వీడియోలు కూడా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేశారు. ఇలా ఇంస్టాగ్రామ్ లోకి నయనతార ఎంట్రీ ఇవ్వడంతో ఈమెకు విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది. ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన 24 గంటల వ్యవధిలోనే ఈమె ఏకంగా 1.4 మిలియన్ ఫాలోవర్స్ ని కైవసం చేసుకున్నారు.

ఇలా ఇప్పటివరకు ఏ హీరోయిన్ కూడా ఈ స్థాయిలో ఫాలోవర్స్ ను సంపాదించుకోలేదు ఇలా అతి తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్న నటిగా నయనతార గుర్తింపు పొందారు. ఇక ఈమె ఇప్పటివరకు 18 మంది సెలబ్రిటీలను ఇంస్టాగ్రామ్ ద్వారా ఫాలో అవుతున్నారు. ఇలా నయనతార ఇంస్టాగ్రామ్ ద్వారా ఫాలో అయ్యే వారిలో ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రిటీ లో ఉండటం గమనార్హం.

ఇకపోతే తెలుగులో ఈమె ఒక హీరోయిన్ని ఫాలో అవుతున్నారని తెలుస్తుంది మరి నయనతార ఫాలో అవుతున్నటువంటి ఆ హీరోయిన్ మరెవరో కాదు సమంత. గతంలో విగ్నేష్ దర్శకత్వంలో సమంత నయనతార విజయ్ సేతుపతి కలిసి ఓ సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా సమంతతో మంచి సన్నిహిత్యం ఏర్పడడంతో ఈమె సోషల్ మీడియాలో కూడా సమంతను ఫాలో కావటం విశేషం.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus