వైరల్ : ‘మై డియర్ డయానా’ అంటూ నయనతారకు లేఖ..!

నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈమె తెలుగు, తమిళ భాషల్లో లేడీ సూపర్ స్టార్ గా దూసుకుపోతుంది. నిజానికి కెరీర్ ప్రారంభంలో ఈమె చేసినన్ని గ్లామర్ రోల్స్ మరే హీరోయిన్ చేసి ఉండదు. అంతేకాదు ఈమె నడిపినన్ని ప్రేమ కథలు కూడా ఏ హీరోయిన్ నడిపి ఉండదు. ఒకానొక టైంలో ఈమె సినీ కెరీర్ కూడా ముగిసిపోయింది అని అంతా అనుకున్నారు. కానీ కథా ప్రాధాన్యత కలిగిన సినిమాలను ఎంచుకుంటూ ఈమె అంతకు మించి ఫామ్లోకి వెళ్ళింది. ఎంత కిందకి పడినా లేవగలను అని నిరూపించింది.

ఈమె పుట్టినరోజు నాడు చాలా మంది విషెస్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈమె క్లాస్ మేట్.. ఏకంగా ఓ లేఖను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కేరళలో ఉన్న తిరువల్లలోని మార్తోమా కాలేజీలో నయన్ చదువుకుంది. ఆ సమయంలో నయన్ కు .. మహేష్ అనే క్లాస్ మేట్ ఉన్నాడు. అతను తన ఫేస్బుక్ ద్వారా నయన్ కు విషెస్ చెబుతూ.. ‘‘నేను డిగ్రీ చదువుతున్నప్పుడు.. క్లాస్ లో నా పక్కన కూర్చున్న నా ఫ్రెండ్ ఇప్పుడొక సూపర్‌ స్టార్‌ అవుతుందని కలలో కూడా అనుకోలేదు. అందులోనూ పురుషాధిపత్యం, నెపోటిజం కలిగిన పరిశ్రమలో ఓ మహిళ ఇంత ఘనత సాధించడం ఆశ్చర్యంగా ఉంది.

తన కెరీర్‌ ఆరంభంలో అభిమానుల కంటే విమర్శలే ఎక్కువ ఉండేవి. అయినా వాటన్నింటినీ జయించి.. ఇప్పుడు సినీ ఇండస్ట్రీని ఏలే శక్తిగా ఎదుగుతుందని బహుశా ఎవ్వరూ ఊహించి ఉండరు. సినిమా మీద ఇష్టంతో విమర్శలన్నింటినీ అధిగమించింది.ఆమె డెడికేషన్ అండ్ డిసిప్లిన్ వల్లనే ఆమె సక్సెస్ ఫుల్ ఉమెన్ గా నిలిచింది.17 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ గా రాణిస్తున్న మై డియర్‌ డయానా(నయనతార).. నీకు వేనవేల పుట్టిన రోజు శుభాకాంక్షలు” అంటూ లేఖలో పేర్కొన్నాడు.


Most Recommended Video

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus