మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ఓ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ రూపొందుతుంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో (Sankranthiki Vasthunam) ఏకంగా రూ.300 కోట్ల క్లబ్ లో చేరాడు అనిల్ రావిపూడి. మరోపక్క చిరంజీవి ‘భోళా శంకర్’ (Bhola Shankar) తో పెద్ద డిజాస్టర్ మూటగట్టుకున్నారు. ‘విశ్వంభర’ (Vishwambhara) పై కూడా అభిమానుల్లో అంచనాలు లేవు. కాబట్టి అనిల్ రావిపూడి పైనే మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), అదితి రావ్ హైదరి (Aditi Rao Hydari) వంటి వారి పేర్లు వినిపించాయి.
ఫైనల్ గా నయనతారకి (Nayanthara) ఫిక్స్ అయ్యారు. నయనతార తమిళంలో లేడీ సూపర్ స్టార్ గా రాణిస్తుంది. కాకపోతే పెళ్లి తర్వాత ఆమె సినిమాలు పెద్దగా ఆడటం లేదు. దీంతో ఆమె డిమాండ్ కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో చిరంజీవి- అనిల్ సినిమాలో నటించడానికి ఆమె రూ.6 కోట్ల పారితోషికానికి ఒప్పేసుకుంది. ఈరోజు నయన్ ‘మెగా 157’ (Mega 157) లో జాయిన్ అయినట్టు అధికారికంగా ఓ వీడియోతో ప్రకటించారు.
అంతా బాగానే ఉంది. కాకపోతే నయనతారతో ఎప్పుడూ ఒక కంప్లైంట్ ఉంటుంది. అదేంటంటే.. నయన్ షూటింగ్ సెట్స్ కి లేట్ గా వస్తుందని, హీరోలను, దర్శకులను ఆమె లెక్క చేయదు అని, ఆమె మూడ్ బాగోకపోతే షూటింగ్ సెట్స్ నుండి వెంటనే వెళ్ళిపోతుందని, చివర్లో ప్రమోషన్స్ కి కూడా రాదని..
ఇలా ఆమె పై పలు కంప్లైంట్స్ ఉన్నాయి. చిరంజీవి ‘సైరా’ (Sye Raa) ‘గాడ్ ఫాదర్’ (God Father) సినిమాల్లో కూడా నయన్ నటించారు. ఆ సినిమాల దర్శకులు కూడా నయన్ గురించి ఇవే కంప్లైంట్స్ ఇచ్చారు. మరి అనిల్ రావిపూడి నయన్ ను హ్యాండిల్ చేయగలడా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.