Nayanthara: భర్తలో చూసిన మార్పులు అవేనంటున్న నయనతార!

స్టార్ హీరోయిన్ నయనతార కనెక్ట్ మూవీతో యావరేజ్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారనే సంగతి తెలిసిందే. పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిలైంది. కథ, కథనం కొత్తగా లేకపోవడం వల్ల కూడా ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. కేవలం 96 నిమిషాల నిడివితో తెరకెక్కడం కూడా ఈ సినిమాకు ఒకింత మైనస్ అయింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నయన్ మాట్లాడుతూ హారర్ సినిమాలు అంటే తనకు ఇష్టమేనని తెలిపారు.

ఈ జానర్ సినిమాలు భయపెట్టినా ఆ భయాన్ని నేను ఎంటర్టైన్మెంట్ లా ఫీలవుతానని ఆమె పేర్కొన్నారు. ఈ దేశంలో లేకపోవడం వల్లే గాడ్ ఫాదర్ మూవీ సక్సెస్ మీట్ లో తాను పాల్గొనలేదని అంతకుమించి ఈ ఈవెంట్ లో పాల్గొనకపోవడానికి స్పెషల్ రీజన్ లేదని ఆమె అన్నారు. లాక్ డౌన్ సమయంలో ఒక డాక్టర్ ఇంట్లో జరిగిన కథ ఆధారంగా కనెక్ట్ సినిమాను తెరకెక్కించామని నయనతార తెలిపారు. విఘ్నేష్ శివన్ దర్శకుడిగా ఒకలా ఉంటే నిర్మాతగా మరోలా ఉంటాడని నయన్ అన్నారు.

డైరెక్టర్ గా ఉన్న సమయంలో తనకు కావాల్సిన సీన్స్, షాట్స్ పై విఘ్నేష్ దృష్టి పెడతాడని ఆమె తెలిపారు. నిర్మాతగా ఉన్న సమయంలో మాత్రం షూట్ ముందుగానే పూర్తైతే మరో సీన్ చెయ్యొచ్చు కదా అని విఘ్నేష్ చెబుతాడని నయనతార కామెంట్లు చేశారు. దర్శకుడిగా నిర్మాతగా విఘ్నేష్ లో చూసిన మార్పులు ఇవేనని ఆమె చెప్పుకొచ్చారు. నాకు విఘ్నేష్ కు మధ్య ఏదైనా గొడవ జరిగితే నేను సైలెంట్ గా గుడ్ బై చెప్పి పడుకుంటానని నయనతార వెల్లడించారు.

నా పర్సనల్ లైఫ్ లోకి మరీ చొచ్చుకురావడం కరెక్ట్ కాదని నయన్ అభిప్రాయపడ్డారు. పెళ్లి తర్వాత వర్క్ లైఫ్ లో ఎక్కువగా మార్పులు రాలేదని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus