‘వాల్తేరు వీరయ్య’ నుండి మరో సూపర్ హిట్ సాంగ్.. ఎలా ఉందంటే..

మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా.. కె.ఎస్.రవీంద్ర (బాబీ కొల్లి) దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కిస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’.. కేథరిన్ ట్రెసా కీలక పాత్రలో కనిపించనుంది.. ‘మాస్ మహారాజా’ రవితేజ ఏసీపీ విక్రమ్ సాగర్ అనే పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ చేశాడు.. బాబీ సింహా, ప్రకాష్ రాజ్ వంటి భారీ తారాగణం, సాంకేతిక నిపుణులతో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న భారీ స్థాయిలో విడుదల కానుంది.

ఆదివారం (జనవరి 8)న విశాఖపట్టణంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది.. ట్రైలర్ మూవీ మీద అంచనాలు పెంచేసింది.. చాలా రోజల తర్వాత ఫుల్ లెంగ్త్ మాస్ క్యారెక్టర్లో మెగాస్టార్ మెస్మరైజ్ చేయనున్నారని ఫిక్స్ అయిపోయారు ప్రేక్షకాభిమానులు.. ‘ఖైదీ నెం:150’ తర్వాత సంక్రాంతి సీజన్‌లో వస్తోన్న మెగాస్టార్ సినిమా ఇదే కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి..ఇప్పటి వరకు రిలీజ్ చేసిన సాంగ్స్ అన్నీ ఆకట్టుకున్నాయి.

ఇక సినిమాలోని చివరి పాటను మల్లారెడ్డి కాలేజీ విద్యార్థుల మధ్య ఘనంగా లాంచ్ చేశారు. డైరెక్టర్, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్, కేథరిన్, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, మల్లారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతకుముందు వచ్చిన పాటల్లానే అలరించేలా ఉంది వీరయ్య చివరి సాంగ్..‘సరస్వతి పుత్ర’ రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. మీకా సింగ్, గీతా మాధురి. డి. వేల్ మురుగన్ చక్కగా పాడారు. మధ్యలో చిరు వాయిస్ రావడం హైలెట్..

‘హలో పిల్లా’ అంటూ స్టార్ట్ అయిన సాంగ్ ట్యూన్, లిరిక్స్ పరంగా బాగుంది. చిరు స్టైలిష్ స్టెప్స్‌తో అదరగొట్టబోతున్నారని హింట్ ఇచ్చిందీ పాట. ‘నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ’ అంటూ క్లాస్, మాస్ ఆడియన్స్‌ని అలరించేలా ఉంది ‘వాల్తేరు వీరయ్య’ ఆల్బమ్‌లోని లాస్ట్ సాంగ్.. మరి కొద్ది గంటల్లో వెండితెర మీద మెగాస్టార్ దర్శనం కాబోతుంది.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus