పెళ్లైన వ్యక్తిని ప్రేమించి మోసపోవద్దు.. నటి కామెంట్స్!

పెళ్లికి ముందే తల్లై సొసైటీ ఎన్నో అవమానాలను ఎదుర్కొంది బాలీవుడ్ నటి నీనా గుప్తా. ఆమె యంగేజ్ లో ఉన్నప్పుడు వెస్ట్ ఇండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ తో డేటింగ్ చేసింది. దానివలన పెళ్లి కాకుండానే 1989లో కూతురికి జన్మనిచ్చింది. ఆ తరువాత నీనా, రిచర్డ్స్ విడిపోయారు. తను జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అభిమానులకు కొన్ని సలహాలు ఇచ్చింది.

ఈమేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేస్తూ పెళ్లైన వ్యక్తితో ఎలాంటి సంబంధం పెట్టుకోవద్దు అంటూ సూచించింది. అతడు భార్య అంటే ఇష్టం లేదని.. ఎక్కువ రోజులు కలిసి ఉండనని.. అది నిజమేనని నమ్మి అతడిని గాఢంగా ప్రేమిస్తావని.. ఆ తరువాత నీ భార్యతో ఎప్పుడు విడిపోతావని అడిగితే.. దానికింకా సమయం ఉందని చెప్పి దాటవేస్తాడని చెప్పింది. ఈలోగానే అతడితో కలిసి తిరుగుతూ, ఏకాంతంగా గడుపుతూ అన్నింటికీ ఒప్పుకుంటావని.. పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే మాత్రం.. అతడు తర్వాత చూద్దాంలే అంటూ మాట మార్చేస్తాడని.. అప్పటికి కానీ అసలు నిజం ఏంటో గ్రహించలేవని వెల్లడించింది. చివరకు ఒంటరిగా మిగిపోతావని.. నా జీవితంలో కూడా ఇదే జరిగింది.. ఆ సమయంలో ఎంతో వేదన అనుభవించా.. దయచేసి ఎవరూ అలాంటి పిచ్చిపనులు చేయకండి అంటూ చెప్పుకొచ్చింది.

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus