Mahesh: అలాంటి రిస్క్ అవసరమా మహేష్.. ఆ అవకాశం ఇవ్వొద్దంటూ?

ఏ సినిమా అయినా టైటిల్ ను బట్టి ప్రేక్శకుల్లో ఒక అభిప్రాయం కలుగుతుంది. టైటిల్ క్లిక్ అయితే కొన్నిసార్లు సులువుగానే సినిమాలు ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించే అవకాశం అయితే ఉంటుంది. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ టైటిల్ కు సంబంధించిన ప్రకటన ఈ నెల 31వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమాకు గుంటూరు కారం అనే టైటిల్ ఫిక్స్ అయిందని సమాచారం అందుతోంది. అయితే ఈ టైటిల్ విషయంలో మెజారిటీ ప్రేక్షకుల నుంచి నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.

గుంటూరు కారం అనే టైటిల్ పవర్ ఫుల్ గానే ఉన్నా మహేష్ బాబుకు సూట్ కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే టైటిల్ అధికారికంగా ప్రకటించే వరకు ఆగాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీల, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. 2024 సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. టైటిల్ తో మహేష్ బాబు రిస్క్ చేయడం కరెక్ట్ కాదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు త్రివిక్రమ్ ఈ మధ్య కాలంలో తెరకెక్కించిన సినిమాల టైటిల్స్ అన్నీ అ అనే అక్షరంతో తెరకెక్కాయి. ఈ సినిమాకు త్రివిక్రమ్ ఆ సెంటిమెంట్ ను ఫాలో అవుతారో లేదో తెలియాల్సి ఉంది. దాదాపుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు 300 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోందని సమాచారం అందుతోంది.

మహేష్ బాబు (Mahesh) కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ జక్కన్న కాంబో మూవీ మొదలుకానుంది. ఆ సినిమా కోసం మేకర్స్ భారీ రేంజ్ లో ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus