టాలీవుడ్ స్టార్ హీరోల విషయంలో అలా జరుగుతోందా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో యంగ్ జనరేషన్ స్టార్ హీరోలుగా ప్రభాస్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు క్రేజ్ ఉంది. ఈ ఏడాది సెకండాఫ్ లో ఈ హీరోల ఒక్క సినిమా కూడా థియేటర్లలో రిలీజ్ కాలేదు. బన్నీ సినిమాలేవీ 2022 సంవత్సరంలో రిలీజ్ కాకపోవడంతో ఆయన ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అయితే వచ్చే ఏడాది ఈ హీరోల సినిమాలన్నీ ఒకే సమయంలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ, ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ 2023 జనవరి నుంచి మొదలుకానుంది. బన్నీ పుష్ప2 షూటింగ్ మొదలైనా ఈ సినిమా షూటింగ్ నిదానంగా జరుగుతోంది. ప్రభాస్, పవన్ కళ్యాణ్ చెరో మూడు ప్రాజెక్ట్ లతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ శంకర్, బుచ్చిబాబు డైరెక్షన్ లో ఒకే సమయంలో నటిస్తూ వేగంగా సినిమాలలో నటించే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

అయితే వచ్చే ఏడాది దసరా టార్గెట్ గా ఈ స్టార్ హీరోల సినిమాలు రిలీజయ్యే ఛాన్స్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కొన్ని వారాల గ్యాప్ లోనే ఆరుగురు హీరోలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రభాస్ సలార్ వచ్చే ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ కానుండగా మహేష్, తారక్ సినిమాల షూటింగ్ లు దసరా టార్గెట్ గా జరుగుతున్నాయి. అయితే స్టార్ హీరోలు కనీసం రెండు వారాల గ్యాప్ తో సినిమాలను రిలీజ్ చేస్తే మంచిది.

2023 ఫస్టాఫ్ లో యంగ్ జనరేషన్ స్టార్ హీరోల సినిమాలలో పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మాత్రమే రిలీజయ్యే ఛాన్స్ ఉండగా ఈ సినిమా షూటింగ్ నత్తనడకన జరుగుతుండటంతో ఆ సమయానికి ఈ సినిమా రిలీజవుతుందో లేదో చెప్పలేము. 2023 ఫస్టాఫ్ లో సీనియర్ హీరోలు, మిడిల్ రేంజ్ హీరోలదే హవా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus