తెలుగులో వచ్చిన ‘బాహుబలి’కి ధీటుగా ‘బ్రహ్మాస్త్ర’ సినిమాను తెరకెక్కించారని బాలీవుడ్ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈరోజు ‘బ్రహ్మాస్త్ర’ ట్రైలర్ విడుదలైయింది. తెలుగు వెర్షన్ కి రాజమౌళి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఆయనే దగ్గరుండి ప్రమోషన్స్ సంగతి కూడా చూసుకుంటున్నారు. నాగార్జున కీలకపాత్ర చేయడంతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. మొదటి నుంచి కూడా ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది. అలాంటిది సడెన్ గా ట్రైలర్ వచ్చిన తరువాత జనాల ఒపీనియన్ మారిపోయినట్లు కనిపిస్తోంది.
భారీ అంచనాలు పెట్టుకున్న నార్త్ ఆడియన్స్ ను కూడా ఈ సినిమా ట్రైలర్ పూర్తి స్థాయిలో మెప్పించలేదని.. కామెంట్స్ చూస్తేనే అర్ధమవుతోంది. ముఖ్యంగా విజువల్స్, గ్రాఫిక్స్ ఆశించిన స్థాయిలో లేవని నెటిజన్లు ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు. వీడియో గేమ్ తరహాలో అనిపిస్తున్నాయని.. తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక సాధారణ యువకుడికి తనకు అతీత శక్తులు ఉన్నాయని తెలియదు. ఆ తరువాత కొన్ని సంఘటన వలన అగ్ని అతడినేమీ చేయలేదని తెలుసుకుంటాడు.
మహా అస్త్రమైన బ్రహ్మాస్త్రానికి హీరోకి లింక్ ఉంటుంది. ఆ తరువాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేదే ఈ సినిమా కథ. తెలుగు ట్రైలర్ కోసం మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇంత భారీ క్యాస్టింగ్, బడ్జెట్ తో సినిమా తీసినప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ ఓ రేంజ్ లో ఉండాలి. కానీ ట్రైలర్ లో చూసిన షూట్స్ చూస్తుంటే ఏదో వెలితిగా అనిపిస్తుంది.
క్వాలిటీ మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. మూడు భాగాలుగా సినిమాను రూపొందించనున్నారు. ఫస్ట్ పార్ట్ సక్సెస్ మీద మిగిలిన రెండు సీక్వెల్స్ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. సెప్టెంబర్ 9న ఈ సినిమా రిలీజ్ కానుంది.
అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!